వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాక్టర్ మాట: కోవిడ్‌ను ఎలా గుర్తించాలి.. ఈ మహమ్మారిని మేనేజ్ చేసే పద్దతులేవి..?

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ ఏ స్థాయిలో విజృభిస్తుందో అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ నగరంలో ఆక్సిజన్ కొరతతో అక్కడి ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. అయితే మనం తీసుకునే జాగ్రత్తలే మన ప్రాణాలకు భరోసా ఇస్తాయని వైద్యులు చెబుతున్నారు. కరోనావైరస్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. అంతేకాదు వ్యాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరి. అయితే టీకాలతో వ్యాధి బారిన పడరని గ్యారెంటీ లేదు కానీ... ప్రాణాలకు మాత్రం ప్రమాదం ఉండదని చెప్పొచ్చు. ఇక రాడిక్స్ హెల్త్‌కేర్‌ ఎండీ డాక్టర్ రవి మాలిక్ మరిన్ని విషయాలను చెబుతున్నారు.

 వెంటనే వైద్యుడిని సంప్రదించాలి

వెంటనే వైద్యుడిని సంప్రదించాలి

కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు,తలనొప్పి, ఒంటినొప్పులు, వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు. పల్స్ ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్ లెవెల్స్‌ను చెక్ చేసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు మాస్కులు ధరించాల్సి ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఇంట్లో కిటికీలు తెరిచి ఉండండి. నిత్యం పానీయాలు తీసుకోండి. జ్వరం వస్తే పారాసిటామాల్ దగ్గర ఉంచుకోండి. అసలు కరోనా లక్షణం ఒక్కటి కనిపించినా చాలు.. వెంటనే ఐసొలేట్ అవ్వండని డాక్టర్ రవి మాలిక్ చెబుతున్నారు. ఇక పల్స్ ఆక్సిమీటర్‌తో మీ ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవచ్చు. మీ ఎడమ చేతి మధ్య వేలుకు ఈ ఆక్సిమీటర్ ఉంచితే.. 45వ సెకనులోవచ్చే రీడింగ్ కరెక్ట్ రీడింగ్ అని చెబుతున్నారు. 92 కంటే తక్కువగా రీడింగ్ చూపిస్తే ఆక్సిజన్ అవసరమని గుర్తించాలి. సాధారణంగా 95 కంటే ఎక్కువగా రీడింగ్ చూపించాలి.

 ప్రోనింగ్ ప్రక్రియతో ఆక్సిజన్ లెవెల్స్ మెరుగువుతుంది

ప్రోనింగ్ ప్రక్రియతో ఆక్సిజన్ లెవెల్స్ మెరుగువుతుంది

జ్వరంకు పారాసిటామల్ తీసుకోండి. అది కూడా కరోనా లక్షణాలు కనిపిస్తేనే తీసుకోవాలి. అయితే రెండు డోసులకు మధ్య సమయం కనీసం 4 గంటలు ఉండాలి. మీ కడుపుపై వెల్లికిల పడుకోండి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులకు చేరే ఆక్సిజన్‌ పెరుగుతుంది.బుడెసొనాయిడ్ రోజుకు రెండు పఫ్‌లు తీసుకోండి. కరోనా లక్షణాలు తగ్గే వరకు ఇలా చేయండి. వైద్యుడిని వెంటనే సంప్రదించండి. వైద్యుల సలహా మేరకు ఈ కింది ట్రీట్‌మెంట్ తీసుకుంటే వ్యాధి నయమవుతుంది. వెల్లకిలా పడుకోవాలి. ఆక్సిజన్ తీసుకోవాలి. రోజుకు 4-6 సార్లు ఆక్సిజన్ లెవెల్స్‌ను మానిటర్ చేయాలి. డెక్సామెథాసోన్ (స్టెరాయిడ్) 6ఎంజీ మాత్ర తీసుకోవాలి లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి. ఇలా 5-10 రోజుల వరకు చేయాలి. ఒక వేళ ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నాయంటే ఐదు రోజుల తర్వాత ఈ స్టెరాయిడ్‌ను మానేయొచ్చు.

 టెస్టింగ్‌తోనే కోవిడ్‌ను గుర్తించొచ్చు..

టెస్టింగ్‌తోనే కోవిడ్‌ను గుర్తించొచ్చు..

ఇక ఒళ్లు నొప్పులుంటే మెఫెనామిక్ యాసిడ్ (Mefenamic Acid)మెఫ్‌టాల్ 500 తీసుకోవాలి. అంతకంటే ముందు మీ డాక్టరును సంప్రదిస్తే బాగుంటుంది. మాత్రలు వేసుకున్న 4 గంటల తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే తిరిగి మళ్లీ వస్తుంటే.. వెంటనే కోల్డ్ కంప్రెషన్ టెస్టు/టెపిడ్ స్పాంజింగ్ టెస్టు చేయించండి లేదా డాక్టర్‌ను సంప్రదించండి. ఇక టెస్టులతోనే వ్యాధి ఉందా లేదా అనేది బయటపడుతుంది. కరోనా కోసం ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. అది లేదంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు చేయించాలి. అయితే ఈ టెస్టులో కచ్చితమైన ఫలితం వచ్చే అవకాశాలు తక్కువ. ఒకవేళ ఈ టెస్టులో కోవిడ్ పాజిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ లేదా సీటీ స్కాన్ టెస్టు అక్కర్లేదు. ఒకవేళ నెగిటివ్ వచ్చి కరోనా లక్షణాలు అలానే ఉంటే మాత్రం ఆర్టీపీసీఆర్, సీటీ స్కాన్ తప్పనిసరిగా చేయించాలి.

టెస్టు రిపోర్టు రాకపోతే..

టెస్టు రిపోర్టు రాకపోతే..

ఎమర్జెన్సీ పద్ధతిన ఈ మెడికేషన్

* జింకోవిట్ రోజుకు రెండు సార్లు 12 గంటల వ్యత్యాసంతో.

* విటమిన్ సీ టాబ్లెట్ లిమ్సీ రోజుకు మూడు సార్లు ఇలా 10 రోజులు తీసుకోవాలి

* కర్పూరంతో ఆవిరి రోజుకు మూడు సార్లు పట్టాలి

*బెటాడిన్ బీడీ 12 గంటలకు ఒకసారి రోజుకు రెండు సార్లు పుక్కలించాలి

* అధిక మొత్తంలో ద్రవపదార్థాలు జ్యూస్‌లు తీసుకోవాలి. ఇందులో నిమ్మరసం, హల్దీ మిల్క్, దానిమ్మ జ్యూస్, చీనికాయల రసం, నీళ్లు,సూప్, నీళ్లల్లో మెంతి విత్తనాలు, కొబ్బరి నీళ్లు

* పండ్లు కూరగాయలతో మంచి ఆహారం తీసుకోవడం

* ప్రాణామాయ మరియు ఇతర శ్వాస సంబంధిత ఎక్స్‌ర్‌సైజ్ చేయడం

ఎలాంటి టాబ్లెట్ తీసుకోవాలి

ఎలాంటి టాబ్లెట్ తీసుకోవాలి

కరోనా వైరస్ అనేది ఇన్‌ఫెక్షన్ కాబట్టి దీనికి యాంటిబయోటిక్స్ ఉపయోగించాలి.అజిత్రోమైసిన్ 500 ఎంజీ రోజుకు ఒక మాత్ర చొప్పున ఐదు రోజులు తీసుకోవాలి. డాక్సిసిలిన్ 100ఎంజీ మాత్ర కూడా రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇక ఫావిపిరావిర్ కూడా తీసుకోవాలి. తొలి రోజు 1800 ఎంజీ రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. రెండో రోజు నుంచి ఏడవ రోజు వరకు ఫావిపిరావిర్ టాబ్లెట్ డోసు తగ్గించి 800 ఎంజీ రోజుకు రెండు సార్లు వేసుకోవాలి. అయితే డాక్టరును సంప్రదించాకే ఫావిపిరావిర్ టాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇవర్‌మెక్‌టిన్ 12 ఎంజీ టాబ్లెట్‌ మూడు రోజుల పాటు రోజుకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది కూడా డాక్టరును సంప్రదించి తీసుకోవాలి. దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు బెనెడ్రిల్ తీసుకోవాలి.మ్యూసినాక్ 600 మాత్ర రోజుకు రెండు సార్లు ఇలా ఏడు రోజుల పాటు తీసుకోవాలి. ఇది కూడా వైద్యుడి సలహా మేరకే తీసుకోవాలి.

 రెమ్‌డెసివిర్ మెడిసిన్

రెమ్‌డెసివిర్ మెడిసిన్

ఇక రెమ్‌డెసివిర్ మెడిసిన్ లక్షణాల వ్యవధిని తగ్గిస్తుంది తప్ప కోవిడ్-19 వల్ల సంభవించే మరణాన్ని నిలువరించలేదు. వైద్యుల సలహా సూచనమేరకే ఈ డ్రగ్ తీసుకోవాల్సి ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నట్లు గుర్తిస్తే రెమ్‌డెసివిర్‌ను ఇవ్వొచ్చు. తొలి లక్షణం గుర్తించిన 10 రోజుల్లోగా రెమ్‌డెసివిర్ ఇవ్వాలి. 100ఎంజీతో ఉన్న ఆరు వయల్స్ ఇవ్వాలి. తొలిరోజున 200 ఎంజీతో డోసును ప్రారంభించాలి. ఆ తర్వాత ప్రతి 24 గంటలకు 100 ఎంజీ డోసును ఐదవ రోజు వరకు ఇవ్వాల్సి ఉంటుంది.

టోసిల్‌జుమాబ్: ఇది కూడా వైద్యుల సలహా సూచనమేరకే తీసుకోవాలి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి ఆక్సిజన్ ఎక్కువగా అవసరమైన సమయంలో ఈ మెడిసిన్ తీసుకోవాలి.

ఇక వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ఐవీ ద్వారా మోనోసెఫ్ ఇవ్వొచ్చు. ఇది హాస్పిటల్‌లో పేషెంట్‌ను అడ్మిట్ చేశాకే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్లాస్మా థెరపీ కూడా ఒక ట్రీట్‌మెంట్. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే అన్ని అస్త్రాలను ప్రయోగించాలి. ప్లాస్మా థెరపీ కూడా ఇందులో ఒకటి.

ఇన్వెస్టిగేషన్

ఇన్వెస్టిగేషన్

లక్షణాలు కనిపించిన 7వ రోజున సీటీ స్కాన్ తీయించాలి. సీటీ సివియారిటీ స్కోరు చెక్ చేయాలి. కంప్లీట్ బ్లడ్ కౌంట్, ఆల్బుమిన్/గ్లోబుమిన్/ఏజీ రేషియో,ఎల్‌డీహెచ్,ఎస్‌ఫెరిటిన్, ఏఎస్‌టీ,ఏఎల్‌టీ, యూరియా, క్రియాటినైన్, ఐఎల్ 6, డి-డైమర్, సీఆర్‌పీ, ప్రొకాల్సిటోనిన్, పీటీ

అడ్మిషన్

అడ్మిషన్

ఎప్పుడు అడ్మిట్ చేయాలి

* ఆక్సిజన్ లెవెల్స్ 93 కంటే తక్కువగా ఉంటే

* మందులు వాడినప్పటికీ జ్వరం తగ్గకపోవడం, నియంత్రణలోకి రాకపోవడం

* కోమోర్బిడిటీస్

* సీటీ/ల్యాబ్ రిపోర్టులు ఆధారంగా

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నప్పుడు

Recommended Video

TRS Party Formation Day: 14 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ - Party Leaders

English summary
When the Covid symptoms are identified one can follow the methods of treatment on the advise of doctors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X