పక్షి ఢీకొనడం వల్లే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిందా ? నిపుణులేమన్నారు ?

ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ నలోని గాట్విక్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ171 బోయింగ్ విమానం కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న ఎయిర్ ఇండియా విమానం కాసేపటికే కిందకు దిగిపోతూ ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 150 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇలా ఎయిర్ ఇండియా విమానం ఎందుకు హఠాత్తుగా కిందికి దిగిపోయింది, ఇంత దారుణమైన ప్రమాదం జరగడం వెనుక ఏముందనే అంశంపై నిపుణులు విశ్లేషణలు అందిస్తున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌కు సరైన వేగాన్ని చేరుకోకుండా పక్షి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు ఎన్డీటీవీకి తెలిపారు.

here is possible reason behind air india AI171 flight crash here is expert opinion

230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు, ఇలా మొత్తం 242 మందితో బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ఒక్కసారిగా కుప్పకూలడానికి పక్షి లేదా పక్షులు ఢీకొనడమే కారణమై ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. లేకుండా విమానం ఇలా హఠాత్తుగా కిందికి దిగిపోదని వారు స్పష్టం చేస్తున్నారు. వేల గంటలు అనుభవం ఉన్న పైలట్ విమానాన్ని ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు కూడా లేవంటున్నారు.

ఇదే అంశంపై మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఇది ప్రాథమికంగా, బహుళ పక్షులను ఢీకొట్టిన కేసులాగా కనిపిస్తుందన్నారు. దీనిలో రెండు ఇంజిన్లు శక్తిని కోల్పోయాయని, టేకాఫ్ పరిపూర్ణంగా ఉన్నా గేర్‌ను పైకి లేపడానికి ముందు, విమానం క్రిందికి దిగడం ప్రారంభమైందని తెలిపారు. ఇది ఇంజిన్ శక్తిని కోల్పోయినప్పుడు లేదా విమానం లిఫ్ట్ జరగడం ఆగిపోయినప్పుడు మాత్రమే జరుగుతుందని వెల్లడించారు. ఫుటేజ్ ని గమనిస్తే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగినట్లు కనిపిస్తోందని, విమానం నియంత్రిత పద్ధతిలో కూలిపోయిందని ఆయన తెలిపారు. పైలట్ మేడే కాల్ ఇచ్చాడని, అంటే అది ఒక విపత్కర పరిస్థితి అని అర్థమని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+