Sunanda Pushkar: మిస్టీరియస్ డెత్..పాకిస్తానీ జర్నలిస్ట్‌తో థరూర్ ఎఫైర్ డౌట్: టైమ్‌లైన్ ఇదే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సునంద పుష్కర్ డెత్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌కు ఊరట లభించింది. ఈ కేసు నుంచి ఆయన విముక్తుడయ్యారు. సునంద పుష్కర్ డెత్ కేసుతో శశిథరూర్‌కు సంబంధం లేదంటూ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఆయన పేరును కొట్టివేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తీర్పు వినిపించింది.
దీనిపై శశిథరూర్ స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించిన టైమ్‌లైన్‌ను ఒకసారి పరిశీలిస్తే.. మిస్టీరియస్ డెత్‌గా అనిపిస్తుంది. శశిథరూర్ ప్రమేయం లేదంటూ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానం తేల్చేయడంతో మరో దేశవ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది సునంద పుష్కర్ డెత్ కేసు. పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్ పేరు మరోసారి తెర మీదికి వచ్చింది ఈ కేసు తీర్పుతో.

జనవరి 16, 2014: శశిథరూర్‌తో అక్రమ సంబంధం కలిగి ఉన్నారనే అనుమానంతో ట్విట్టర్ వేదికగా పాకిస్తానీ జర్నలిస్ట్ మెహర్ తరార్‌తో సునంద పుష్కర్ మాటల యుద్దం.
జనవరి 17, 2014: ఢిల్లీలోని హోటల్ లీలా ప్యాలెస్ సూట్ నంబర్ 345లో నిర్జీవంగా కనిపించిన సునంద పుష్కర్. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు.
జనవరి 19, 2014: సునంద పుష్కర్ మరణం హఠాత్తుగా.. అసహజంగా చోటు చేసుకున్నట్లు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పోస్ట్‌మార్టమ్ నివేదిక. చేతి మీద గాయాలు ఉన్నట్లు తేల్చిన పోస్ట్‌మార్టమ్ నివేదిక. ఎడమ అరచేతిపై లోతుగా దిగిన పంటిగాట్లు ఉండటం, శరీరంలో యాంటీ యాంగ్జయిటీ డ్రగ్ అల్ఫ్రాజోలమ్ నామమాత్రంగా లభించడం వల్ల ఆమె మరణం ఓవర్ డోస్ డ్రగ్ వల్ల సంభవించలేదంటూ పోస్టుమార్టమ్ నివేదిక స్పష్టీకరణ
జనవరి 20, 2014: ఆమెకు ప్రాణాపాయాన్ని కలిగించే ఎలాంటి అనారోగ్యమూ లేదంటూ మరణించడానికి కొద్దిరోజుల ముందే కేరళకు సునంద పుష్కర్ ఫ్యామిలీ డాక్టర్ స్టేట్‌మెంట్.
జనవరి 20, 2014: హోమిసైడల్ (హత్య), సూసైడల్ (ఆత్మహత్య), యాక్సిడెంటల్ (ప్రమాదకరం) మూడు కారణాల వల్లే ఆమె మరణించి ఉండొచ్చంటూ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ రిపోర్ట్
జనవరి 23, 2014: విషం సేవించడం వల్ల ఆమె మరణించి ఉండొచ్చంటూ దర్యాప్తు అధికారుల వెల్లడి. యాంటీ డిప్రెసన్ డ్రగ్ అల్ప్రాజోలమ్, పెయిన్ కిల్లర్ ఎక్సెడ్రిన్ మిశ్రమంతో కూడిన మందులను అధిక మోతాదులో తీసుకోవడం కారణమంటూ అనుమానాలు. దీనితో మరోసారి శాంపిళ్లను ఎయిమ్స్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు అందజేత.
జులై 2, 2014: అటాప్సీ రిపోర్ట్‌లో మార్పులు చేయాలనే ఒత్తిళ్లను ఎదుర్కొన్నట్లు పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన ఎయిమ్స్ టీమ్ డాక్టర్ సుధీర్ గుప్తా వెల్లడి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు అఫిడవిట్ అందజేత.
సెప్టెంబర్ 30, 2014: ఢిల్లీ పోలీసులకు విస్కెరా రిపోర్ట్‌ను అందజేసిన ఎయిమ్స్ డాక్టర్లు
అక్టోబర్ 10, 2014: విస్కెరా రిపోర్ట్‌కు అనుగుణంగా మరో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికను ఢిల్లీ పోలీసులకు అందజేసిన ఎయిమ్స్ డాక్టర్లు. దీన్ని అసంపూర్ణ రిపోర్ట్‌గా పేర్కొన్న పోలీసులు.
నవంబర్ 9, 2014: సునంద పుష్కర్ డెత్ కేసు విచారణను న్యాయస్థానం పర్యవేక్షణలో నిర్వహించేలా కోర్టులో పిల్ వేస్తానంటూ వెల్లడించిన బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి.
జనవరి 6, 2015: సునంద పుష్కర్ హత్యకు గురైనట్లు వెల్లడించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ. అనుమానాస్పద మృతి కేసును హత్యగా మార్పు
ఫిబ్రవరి 2015: సునంద పుష్కర్ విర్సెరా శాంపిళ్లను సేకరించిన వాషింగ్టన్‌లోని ఎఫ్‌బీఐ ల్యాబ్ ప్రతినిధులు. విషం వల్లే ఆమె మరణించినట్లు నిర్ధారణ
నవంబర్ 2015: సునంద పుష్కర్ మరణించడానికి ముందు ఆమెతో చివరిసారిగా మాట్లాడిన జర్నలిస్ట్ నళిని సింగ్‌ను విచారించిన ఢిల్లీ పోలీసులు.
ఫిబ్రవరి 2016: శశిథరూర్‌ను విచారించిన ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే ఆమె మరణించిన వెల్లడించిన శశిథరూర్.
జులై 6, 2017: సునంద పుష్కర్ డెత్ కేసు విచారణను న్యాయస్థానం పర్యవేక్షణలో నిర్వహించేలా ఢిల్లీ హైకోర్టులో పిల్ వేసిన బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి.
అక్టోబర్ 26, 2017: బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి వేసిన పిల్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
జనవరి 29, 2018: సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి. ఈ కేసులో దర్యాప్తు పురోగతి గురించి వివరించాంటూ ఢిల్లీ పోలీసులను ఆదేశించిన సుప్రీంకోర్టు
ఏప్రిల్ 20, 2018: కేసుకు సంబంధించిన పూర్వాపరాలను వివరిస్తూ సుప్రీంకోర్టుకు నివేదిక అందించిన ఢిల్లీ పోలీసులు.
మే 15, 2018: శశిథరూర్ పేరును ఛార్జిషీట్‌లో చేర్చిన ఢిల్లీ పోలీసులు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించి ఉండొచ్చనే కారణంతో ఆయనపై ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన పోలీసులు.
జూన్ 5, 2018: ఛార్జిషీట్‌కు అనుగుణంగా శశిథరూర్‌కు సమన్లను జారీ చేసిన ఢిల్లీ కోర్టు. జులై 7వ తేదీన హాజరు కావాలంటూ ఆదేశాలు.
ఫిబ్రవరి 4, 2019: అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానానికి కేసు ట్రాన్స్‌ఫర్.
జులై 18, 2019: కేసు పక్కదారి పడుతోందంటూ శశిథరూర్ చేసిన విజ్ఞప్తి మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రత్యేక ఆదేశాలు జారీ. ఈ కేసుతో ముడిపడి ఉన్న ఏ ఒక్క డాక్యుమెంట్‌ను గానీ, మెడికల్ డేటాను గానీ న్యాయ నిపుణులు, మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌కు మినహా మరో థర్డ్‌పార్టీకి అందజేయకూడదంటూ ఆదేశాలు.
మార్చి 17, 2021: సీనియర్ అడ్వొకేట్ వికాస్ పహ్వా.. శశిథరూర్‌ను నిర్దోషిగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు. ఇప్పటిదాకా కూడా ఈ కేసులో ఎలాంటి ముగింపు రాలేదని వాదించిన వికాస్ పహ్వా.
ఏప్రిల్ 12, 2021: శశిథరూర్‌పై తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం
జులై 2, 2021: మరోసారి తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం
జులై 27, 2021: మరోసారి తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం. ఆగస్టు 18వ తేదీకి వాయిదా
ఆగస్టు 18, 2021: శశిథరూర్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు. ఆయన ప్రమేయం లేదంటూ వ్యాఖ్య. నిందితుడిగా ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచిన శశిథరూర్ పేరు కొట్టివేత.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications