జైలులో లాలూ: తోటమాలి పనికి రోజుకు రూ.93 సంపాదన

పాట్నా: పశుదాణా కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో తోట పని చేసినందుకు రోజుకు రూ.93 కూలీ లభిస్తోంది. దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నర ఏళ్ళపాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇటీవలనే తీర్పు చెప్పింది. దీంతో లాలూను బిర్సా ముండా జైలుకు తరలించారు.

లాలూ వయసును దృష్టిలో పెట్టుకుని. ఆయన చేయ గలిగిన పనులనే అప్పగిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం లాలూకు బిర్సా ముండా జైల్లో తోటపని అప్పగించారు. తోటపని చేసినందుకు లాలూకు రోజుకు 93 రూపాయల కూలీ లభిస్తుంది.

Here’s what Lalu Prasad will do in jail to earn Rs 93 per day

గడ్డి కుంభకోణంలో సీబీఐ కోర్టు తీర్పు వెలవరించిన వెంటనే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. లాలూ విడుదల చేసిన హిందీలో ఉండడం విశేషం.

లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమానత్వం, దళితులు, వెనుకబడిన వర్గాల కోసం​ప్రాణాలైనా ఇస్తాగానీ.. కాషాయ పార్టీకి తలొగ్గేది లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మనువాదులుగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+