బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hero: ప్రముఖ హీరో మృతి, 36 గంటల శ్రమవృధా, అవయవాలు దానం, లాక్ డౌన్ లో బైక్ లో వెళ్లి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన ప్రముఖ నటుడు సంచారి విజయ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సంచారి విజయ్ ప్రాణాలు రక్షించడానికి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు 36 గంటలు అందించినా చికిత్స విఫలం అయ్యింది. బహుబాష నటుడు, సినీ నిర్మాత, దర్శకుడు ఈగ ఫేమ్ కిచ్చ సుదీప్ సైతం సంచారి విజయ్ ప్రాణాలు కాపడటానికి ఆర్థిక సహాయం చేసి ప్రతినిత్యం ఆయన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన మృతికి కన్నడ చిత్రసీమ ప్రముఖులతో పాటు కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప, రాజకీయాలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సంచారి విజయ్ అవయవాలు అన్నీ దానం చెయ్యాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

Mrs India Winner: వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం, మాజీ మిసెస్ రూ. కోట్లు డీల్, ఆ వీడియోతో !Mrs India Winner: వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం, మాజీ మిసెస్ రూ. కోట్లు డీల్, ఆ వీడియోతో !

 లాక్ డౌన్ లో బైక్ లో వెళ్లిన హీరో

లాక్ డౌన్ లో బైక్ లో వెళ్లిన హీరో

లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంలోనే శనివారం రాత్రి బెంగళూరులో స్నేహితులతో కలిసి బైక్ లో వెలుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో సంచారి విజయ్ కి తీవ్రగాయాలైనాయి. వెంటనే సంచారి విజయ్ ని బన్నేరుఘట్ట రోడ్డులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. సంచారి విజయ్ తలకు తీవ్రగాయాలు కావడంతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందించారు.

 36 గంటల శ్రమవృధా

36 గంటల శ్రమవృధా

అపోలో ఆసుపత్రిలో సుమారు 36 గంటల పాటు సంచారి విజయ్ కి చికిత్స అందించారు. సంచారి విజయ్ ప్రాణాలతో భయటపడటం చాలా కష్టం అని సోమవారం ఉదయం అపోలో ఆసుపత్రి వైద్యులు అన్నారు. సంచారి విజయ్ కోమాలకు వెళ్లే చాన్స్ ఉందని వైద్యులు చెప్పి కొన్ని గంటల్లోనే ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 అవయవాలు దానం

అవయవాలు దానం

హీరో సంచారి విజయ్ అవయవాలు అన్ని దానం చెయ్యాలని ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. సంచారి విజయ్ అవయవాలు దానం చెయ్యడానికి అన్ని ఏర్పాటు చేసుకోవాలని కుటుంబ సభ్యులు వైద్యులకు సూచించారు. లాక్ డౌన్ సమయంలో స్నేహితులతో కలిసి భోజనం చెయ్యడానికి బైక్ లో వెలుతున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందని సంచారి విజయ్ సన్నిహితులు అంటున్నారు.

 సంతాపం తెలిసిన సీఎం

సంతాపం తెలిసిన సీఎం

హీరో సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ, మంత్రి బళ్లారి శ్రీరాములు, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజేతో పాటు పార్టీలకు అతీతంగా ప్రముఖ నాయకులు సంతాపం తెలిపారు. బహుబాష నటుడు, సినీ నిర్మాత, దర్శకుడు ఈగ ఫేమ్ కిచ్చ సుదీప్ సైతం సంచారి విజయ్ ప్రాణాలు కాపడటానికి ఆర్థిక సహాయం చేసినా ఫలిలం లేకుండా పోయింది. ప్రముఖ నటుడిని తాము కోల్పోయామని కన్నడ చిత్రపరిశ్రమ విచారం వ్యక్తం చేస్తోంది.

English summary
Hero: Kannada actor Sanchari Vijay dies after being critically injured in road accident in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X