• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెప్టెన్ ప్రభాకరన్ సంకల్పం..! కరోనా విషయంలో హీరో విజయకాంత్ ప్రకటన పట్ల ప్రశంసల వెల్లువ..!

|

చెన్నై/హైదరాబాద్ : తెరమీద కనిపించే హీరోలు నిజ జీవితంలో తమ హీరోయిజాన్ని చాలా అరుదుగా చాటుకుంటారు. కొంత మంది తెర మీద ఎంత హీరోయిజం చూపిస్తారో నిజ జీవితంలో కూడా అదే విధంగా ఉంటారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్నపుడు ఎంతో కొంత విరాళం ప్రకటించి మొహం చాటేసే హీరోలను చాలా మందిని చూసాం. కాని ఏదైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ అందులో ప్రజలను భాగస్వామ్యం చేయడమే నిజమైన హీరోయిజానికి నిదర్శనం. తమిళ నాడులో అచ్చం ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

తమిళ హీరోల స్టైలే వేరబ్బా.. శభాష్ అనిపించుకున్న హీరో విజయకాంత్..

తమిళ హీరోల స్టైలే వేరబ్బా.. శభాష్ అనిపించుకున్న హీరో విజయకాంత్..

హీరో విజయకాంత్ చేసిన ఆ కార్యక్రమానికి, సాహసోపేతమైన నిర్ణయానికి నీరాజనాలు పడుతున్నారు తమిళ ప్రజలు. కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో హీరో విజయకాంత్ సంకల్పం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. తమిళ ప్రజలందరూ విజయ్ కాంత్ నిర్ణయానికి నీరాజనాలు పడుతున్నారు. కరోనా బారిన పడి చనిపోయిన వారి పట్ల కొంత మంది కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికి, విజయ్ కాంత్ వంటి హీరో ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోవడం పట్ల అన్ని వర్గాలనుండి సానుకూల వాతావరణం వ్యక్తం అవుతోంది.

కరోనా మృతుల పట్ల విజయ కాంత్ ఉదారత.. జేజేలు పలుకుతున్న తమిళ తంబీలు..

కరోనా మృతుల పట్ల విజయ కాంత్ ఉదారత.. జేజేలు పలుకుతున్న తమిళ తంబీలు..

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ తమిళ కథానాయకుడు, రాజకీయ నేత విజయకాంత్ చూపిన ఉదారత ఎన్నటికీ మరువలేనిదనే చర్చ జరుగుతోంది. తమిళనాడులోని పలు శ్మశానాల్లో కరోనా మృతులను ఖననం చేయడానికి వ్యతిరేకతద వ్యకం అవుతోంది. కరోనా వ్యాధి సోకిన వ్యక్తిని ఖననం చేస్తే ఆ ప్రాంతంలో కరోనా ప్రబలుతుందనే అపోహలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా బారిన పడి మరణించిన వ్యక్తిని కాల్చినా, పూడ్చినా ఆ ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందుతుంది కాబట్టి తమ ప్రాంతాల్లో దహనం వద్దు, ఖననం వద్దు అంటూ స్థానికులు పట్టుబడుతున్నారు.

కరోనా మృతుల ఖననానికి తన కాలేజీ మైదానం వాడుకోవచ్చు.. గొప్పమనసు చాటుకున్న కెప్టెన్ ప్రభాకరన్..

కరోనా మృతుల ఖననానికి తన కాలేజీ మైదానం వాడుకోవచ్చు.. గొప్పమనసు చాటుకున్న కెప్టెన్ ప్రభాకరన్..

దేశంలో పలుచోట్ల ఇవే పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇదే పరిణామం హీరో విజయ్ కాంత్ ను కదిలించినట్టు తెలుస్తోంది. వెంటనే ఏ హీరో తీసుకోలేని నిర్ణయాన్న ఆయన తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా మృతులను పూడ్చిపెట్టడానికైనా, ఖననం చేయడానికైనా తన సొంత కాలేజీలోని మైదానాన్ని శ్మశానంగా వాడుకోవచ్చని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు విజయ్ కాంత్. ఇంతకుమించిన గొప్ప ఉదారత ఏముంటుందనే చర్చ కూడా జరుగుతోంది. కోట్లు విరాళం ఇవ్వడం కంటే కూడా విజయ్ కాంత్ చూపిన ఉదారత గొప్పదని తమిళనాడులో ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నట్టు సమాచారం.

విజయకాంత్ ది గొప్ప మనసు.. పొగడ్తలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్..

విజయకాంత్ ది గొప్ప మనసు.. పొగడ్తలతో ముంచెత్తిన పవన్ కళ్యాణ్..

విజ‌య్‌కాంత్‌కు చెన్నై శివార‌ల్లో ఆండాళ్‌ అళగర్ పేరుతో ఇంజినీరింగ్‌ కళాశాల ఉంది. దీనికి పక్కనే పెద్ద గ్రౌండ్ ఉంది. అందులో కొంత క‌రోనా మృతుల ఖ‌న‌నానికి ఇస్తాన‌ని విజ‌య్ కాంత్ ప్ర‌క‌టించారు. కరోనాతో మృతి చెందిన వారిని ఖననం చేస్తే దానివల్ల ఎవరికీ వైరస్ రాదన్నారు. ఇది ప్రజలకు ప్రచారం చేయానలి ప్రభుత్వాన్ని కోరారు. తాజా నిర్ణయంతో విజ‌య్ కాంత్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ నిర్ణయం తీసుకున్న విజయ్ కాంత్ ది గొప్ప వ్యక్తిత్వం అని ప్రశంసించారు.

English summary
The Tamil people are resentful of the heroic decision of the hero Vijayakanth. The hero of Vijayakanth's will is praising the present day of the corona pandemonium. Tamil people are resentful of Vijay Kant's decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X