బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేసవి ఎఫెక్ట్: ట్రాఫిక్ పోలీసుల కోసం హైటెక్ బూత్: ఏసీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్: 19 చోట్ల.. !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ట్రాఫిక్ కానిస్టేబుళ్ల విధులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. విధి నిర్వహణలో ఉన్నంత సేపూ వారు నిల్చునే ఉండక తప్పని పరిస్థితి. వాహనాల కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పటికీ..దాన్ని భరిస్తూనే విధులను నిర్వర్తిస్తుంటారు. వేసవికాలంలో ట్రాఫిక్ పోలీసులు మరింత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. భగభగమండే ఎండవేడికి తోడు- వాహన కాలుష్యం మధ్య నిప్పుల మీద నిల్చున్నట్టుంటుంది వారికి.

 పీపీపీ పద్ధతిన ఏర్పాటు..

పీపీపీ పద్ధతిన ఏర్పాటు..

దీన్ని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు నగర పోలీసు అధికారులు ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల కోసం అత్యాధునికమైన బూత్‌లను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిన వాటిని రూపొందించారు. ఈ ట్రాఫిక్ బూత్‌లో కానిస్టేబుళ్లకు ఎయిర్ కండీషన్ సౌకర్యాన్ని, శుద్ధి చేసిన మంచినీటి వసతిని కల్పించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను ఈ బూత్‌లో అమర్చారు.

బయోమెట్రిక్ సిస్టమ్‌తో పనిచేసేలా..

బయోమెట్రిక్ సిస్టమ్‌తో పనిచేసేలా..

వాహనదారులెవరైనా ప్రమాదానికి గురైతే.. ప్రథమ చికిత్స చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ట్రాఫిక్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏసీ సౌకర్యం కల్పించినందున క్లోజ్డ్ డోర్స్‌ను వాటికి అమర్చారు. ఈ డోర్స్‌ను ఎవరు పడితే వారు తెరవడానికి వీలుండదు. దీనికోసం ప్రత్యేకంగా బయోమెట్రిక్ వ్యవస్థతో దాన్ని అనుసంధానించారు. వేలిముద్రల ద్వారా ఈ ట్రాఫిక్ బూత్ తలుపులు తెరచుకుంటాయి. బూత్‌లో కూర్చునే వాహనాలను నియంత్రించడానికి మైక్ సిస్టమ్‌, ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి సీసీటీవీ ఉంటుందని అధికారులు తెలిపారు.

బెంగళూరులో 19 చోట్ల..

బెంగళూరులో 19 చోట్ల..

బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పరిధిలో మొత్తం 19 చోట్ల ఈ అత్యాధునికమైన బూత్‌లను ఏర్పాటు చేశారు. వాటిని ఇంకా ప్రారంభించాల్సి ఉంది. అత్యంత రద్దీ మార్గాల్లో వాటిని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. వేసవిలో ట్రాఫిక్ పోలీసుల ఎదుర్కొనే ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని పీపీపీ పద్ధతిన వాటిని రూపొందిచామని అన్నారు. త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. వాహనాలను నియంత్రించడానికి అత్యాధునిక వసతులను ప్రవేశపెడతామని చెప్పారు.

English summary
Hi-tech traffic police kiosks are being set up at 19 locations in Bengaluru under the Public Private Partnership (PPP) model. The kiosk boasts of AC, first-aid box, fire extinguisher, a seating arrangement, potable water, mic, CCTV camera and a biometric door.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X