సిద్దరామయ్యకు బిగ్ రిలీఫ్ - కోర్టు తాజా ఆదేశాలు..!!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు బిగ్ రిలీఫ్ దొరికింది. ముడా వ్యవహారంలో గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని చట్ట వ్యతిరేకమని వాదించిన సిద్దరామయ్య కోర్టును ఆశ్రయించారు. సీఎం సిద్దరామయ్యకు నోటీపసుల వ్యవహారం రాజకీయంగా వివాదానికి కారణమైంది. ఈ సమయంలో హైకోర్టులో సిద్దరామయ్య వేసిన పిటీషన్ పైన కోర్టు విచారించింది. ఆగస్టు 29వ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ట్రయల్ కోర్టుకి ఆదేశాలిచ్చింది.
హైకోర్టు ఆదేశాలు
కర్ణాటక సీఎం సిద్దరామయ్యై ముడా భూ కుంభకోణం ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వటం వివాదానికి కారణమైంది. దీని పైన సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రిట్ పిటిషన్‌లో ప్రాసిక్యూషన్ నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరామని చెప్పారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వాన్నీ కూల్చే ప్రయత్నం జరుగుతోందని ప్రస్తావించారు.

తప్పు చేయలేదు
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు..సిద్దరామయ్యకు అనుకూలంగా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తాను 40 ఏండ్లుగా మంత్రిగా వ్యవహరించానని తన రాజకీయ జీవితంలో ఎక్కడా ఎలాంటి మచ్చ లేదని సీఎం సిద్దరామయ్య చెప్పుకొచ్చారు. ప్రజల ఆశీస్సులతో వారి సేవలో కొనసాగుతున్నానని అన్నారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని చెబుతూ తాను ఎలాంటి తప్పూ చేయలేదని రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసునని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
రాజకీయ వివాదం
ఇక ముడా స్కామ్‌లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య విచారణకు గవర్నర్ అనుమతించిన క్రమంలో సిద్ధరామయ్య సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కర్నాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఇప్పటికే డిమాండ్ చేశారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్లాక్‌మెయిల్‌కు తాము భయపడబోమని స్పష్టం చేశారు. అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా తాము మూడు నెలలుగా పోరాడుతున్నామని చెప్పారు. ఇలా రాజకీయంగా ఈ శ్యవహారం పైన కాంగ్రెస్ - బీజేపీ మధ్య మాటల యద్దం కొనసాగుతోంది. ఈ సమయంలో కోర్టులో సిద్దరామయ్యకు రిలీఫ్ దక్కింది.












Click it and Unblock the Notifications