Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలగించాలి అన్నవారికి హైకోర్టు షాక్!!

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పిటీషన్ దాఖలు చేసిన సామాజిక కార్యకర్తకు షాక్ ఇచ్చింది.

కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని పిటీషన్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్త ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ ను దాఖలు చేశారు.

High Court shocked those who wanted Arvind Kejriwal to be removed as the Chief Minister of Delhi

పిటీషన్ కొట్టివేత.. కీలక వ్యాఖ్యలు చేసిన బెంచ్
అయితే ఈ పిటిషన్ ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది. దీనిపై రాజ్యాంగ అధికారులను సంప్రదించాలని హైకోర్టు కోరింది. కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనాలు జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలని, హైకోర్టు వెల్లడించింది. ఇది న్యాయస్థానం అని పేర్కొని, రాష్ట్రపతి పాలన లేదా గవర్నర్ పాలన కోర్టు విధించినట్టు ఏదైనా ఉదాహరణ ఉందా అంటూ పిటిషనర్ ను ప్రశ్నించింది.

పిల్ లో పేర్కొన్న కీలక అంశాలు
కోర్టు ఈ పిటిషన్ ను స్వీకరించడానికి నిరాకరించడంతో విష్ణు గుప్తా లెఫ్టినెంట్ గవర్నర్ కు అప్పీలు చేస్తానని వెల్లడించారు.
విష్ణు గుప్తా తరఫున పిల్ దాఖలు చేసిన న్యాయవాది మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్టు తర్వాత రాజధానిలో ప్రభుత్వ కొరత ఏర్పడిందని, తర్వాత రాజ్యాంగ ప్రతిష్టంభన చోటుచేసుకుందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే ప్రసక్తేలేదని విష్ణు గుప్త తరపు న్యాయమూర్తి తెలిపారు

కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత రాజ్యాంగ ప్రతిష్టంభన
మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వ కొరత ఏర్పడిందని గుప్తా తరపు న్యాయవాది వాదించారు. అరెస్టు తర్వాత రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిల్ లో పేర్కొన్నారు.

చట్టపరమైన సమస్య కాదన్న హైకోర్టు
కేజ్రీవాల్ కి బదులు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రిని చేయొచ్చని వారు పేర్కొన్నారు. అయితే ఇది చట్టపరమైన సమస్య కాదని ఆచరణాత్మక సమస్యని, ఈ వ్యవహారంలో తాము తల దూర్చలేమని చెప్పిన హైకోర్టు బెంచ్ ఇది గవర్నర్ పరిధిలోని వ్యవహారమని తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+