జపాన్ బుల్లెట్, చైనా హైస్పీడ్ రైళ్లు: టాటా చర్చలు..
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో భారత్‌లో అయిదు హైస్పీడ్ రైల్వే పథకాలు పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి వివిద దేశాల నుండి సహకారం లభించనుంది. బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు జపాన్ సిద్ధం కాగా, అధిక వేగంతో ప్రయాణించే రైలు ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్న చైనా కూడా ముందుకు వస్తోంది. ఈ పథకాల కోసం భారతీయ కంపెనీలతో చైనా సంస్థలు జట్టు కట్టనున్నాయి.

దేశీయ హైస్పీడ్ రైల్వే పథకాలకు ప్రభుత్వం త్వరలో బిడ్లు ఆహ్వానించనుంది. భారతీయ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో వీటికి పోటీ పడేందుకు చైనా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. టాటా ప్రాజెక్ట్.. రైల్వే ప్రాజెక్టుకు అవసరమైన ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన చైనా కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
భారత్‌లు బుల్లెట్ రైళ్ల పథకాలకు ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ సహకారం అందిస్తామని మోడీకి టోక్యో పర్యటనలో జపాన్ హామీ ఇచ్చింది. చైనా పెట్టుబడులు, భాగస్వామ్యం పైన ఈ నెల మూడోవారంలో భారత్‌లో పర్యటించే చైనా అధ్యక్షులు జిన్ పింగ్ వెల్లడించే అవకాశముంది. చైనాలో రైల్వే ప్రాజెక్టులు నిర్మించే ప్రధానమైన ఓ సంస్థ టాటా ప్రాజెక్ట్స్‌తో జట్టు కట్టే అవకాశముందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications