మహారాష్ట్రలో హైడ్రామా.. మద్దతుపై కాంగ్రెస్ నాన్చివేత, గవర్నర్‌ను రెండురోజుల సమయం అడిగిన ఆదిత్య..
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుపై కూడా అనిశ్చితి కొనసాగుతుంది. ఇవాళ రాత్రి 7.30 గంటల వరకు గవర్నర్ భగత్ సింగ్ సమయం ఇవ్వగా.. ఆదిత్య థాకరే తమ నేతలతో కలిసి సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తామనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. శరద్ పవార్‌తో చర్చించి నిర్ణయం చెబుతామని చెప్పడంతో మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ మొదటికొచ్చాయి.
అయితే తమకు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని శివసేన నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్యేలతో కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లట్ తమ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఈ మేరకు ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. పవార్‌తో చర్చించాక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కానీ ఈ లోపు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ కూడా వస్తోంది.

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆదిత్య థాకరే చెప్తున్నారు. ఇతర పార్టీలతో కూడా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. తమకు మరింత సమయం ఇవ్వాలని వార్తలొచ్చాయి. మద్దతుపై కాంగ్రెస్ మంగళవారం ప్రకటన వెలువడనుండగా.. మరో రెండు పార్టీలు మద్దతు తీసుకుంటామని ఆదిత్య చెప్పారు. మరో రెండురోజుల సమయం ఇవ్వాలని కోరాగా.. గవర్నర్ నిరాకరించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని.. ప్రభుత్వ ఏర్పాటుతోనే పరిష్కారం అవుతాయని ఆదిత్య బృందం గవర్నర్‌తో తెలిపింది.












Click it and Unblock the Notifications