తస్మాత్ జాగ్రత్త: ఈ రాష్ట్రాల్లోనే HIV కేసులు అధికంగా ఉన్నాయి
Recommended Video

భారతదేశంలో హెచ్ఐవీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం శుభవార్తగా నిలువగా... ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మిజోరాం, త్రిపురా రాష్ట్రాల్లో మాత్రం ఎయిడ్స్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్య కుటంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లోక్ సభలో తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో హెచ్ఐవీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో వివరణ ఇచ్చింది ఆ శాఖ.అక్కడ డ్రగ్స్ కేసులు ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే... లైంగికంగా కలిసేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించడం లేదని మంత్రి తెలిపారు.
మిజోరాంలో నాలుగు ప్రాంతాల్లో, త్రిపురాలోని ఒక ప్రాంతంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారిలోనే ఎక్కువగా హెచ్ఐవీ ఉన్నట్లు గుర్తించామని మంత్రి సభకు తెలిపారు. దేశం మొత్తం మీద ఇలాంటి కేసులు 6.3శాతంగా ఉన్నాయి. మరోవైపు ఐజ్వాల్‌లో డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల్లో హెచ్ఐవీ 37.44శాతం ఉండగా... చంపాయ్‌లో 33.06శాతం, కోలసిబ్ ప్రాంతంలో 38.14 శాతంగా ఉంది. ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా మహిళల్లోనే ఎక్కువగా హెచ్ఐవీ కేసులు బయటపడ్డట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఎయిడ్స్ పై అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని జిల్లాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్ డైరెక్టర్ సమీరన్ పండా. ఎయిడ్స్ బారినుంచి పడకుండా నివారణ మార్గాలు అన్వేషించాలని ఆయన చెప్పారు. అదే విషయమై జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. హెచ్ఐవీ సోకి ప్రస్తుతం 12.28లక్షల మంది చికిత్స పొందుతున్నారని చెప్పిన పాండా.. ఇంకా చాలామంది హెచ్ఐవీతోనే బాధపడుతున్నారని... అలాంటి వారికి చికిత్స అందేలా చూడాలని చెప్పారు. భారత్‌లో దాదాపు 21 లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారని అందులో కనీసం 90 శాతం మందికి చికిత్స చేయించడమే తన లక్ష్యం అని పాండా చెప్పారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications