యువతి కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, హత్య: సరదాగానే అంటూ నిందితుల దిగ్భ్రాంతికర సమాధానం
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో జనవరి 2న ఓ 16ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసిన ముగ్గురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక, ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డారని పోలీసులు అడిగిన ప్రశ్నకు.. నిందితులు చెప్పిన సమాధానం దిగ్భ్రాంతికి గురిచేసింది.

గ్యాంగ్ రేప్, హత్య
మీరట్ ప్రాంతానికి చెందిన జుల్ఫికర్ అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్ అనే ముగ్గురు యువకులు జనవరి 2 బాధిత యువతిని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని నోయిడాలోని కాలువలో పడేసి పారిపోయారు.

అమ్మాయి మరో వ్యక్తి వెళ్లిందనుకున్నారు..
కాగా, తమ కూతురును దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని బాధితురాలు తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. మొదట నమ్మని పోలీసులు.. ఆ తర్వాత దర్యాప్తు ప్రారంభించడంతో ఈ విషయం వెలుగు చూసింది. నిందితులు దొరికే వరకు కూడా ఆ అమ్మాయి వేరే వ్యక్తితో వెళ్లిపోయిందనుకున్నారు పోలీసులు.

ముగ్గురు నిందితుల అరెస్ట్
ఈ ఘటన జరిగిన మరుసటి రోజు నిందిత యువకులు ప్రయాణించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డారని నిందితులను ప్రశ్నించగా.. ఆ దుర్మార్గులు సమాధానం పోలీసులకే దిగ్భ్రాంతికి గురిచేసింది.

నిందితుల దిగ్బ్రాంతికర సమాధానం
‘రాత్రి మద్యం తాగుతూ ముగ్గురం ఓ సినిమా చూశాం. ఆ తర్వాత సరదాగా రహదారిపై వెళుతున్న ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాం' అని నిందితులు పోలీసులకు సమాధానం ఇవ్వడం గమనార్హం. ఈ సమాధానంతో నిందితులు ఎంత రాక్షసంగా ఉన్నారో అర్థమవుతోంది. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications