CJI NV Ramana: కర్ణాటక హిజబ్ నిషేధంపై సుప్రీంకోర్టు విచారణ: రంగంలో ఆ సీనియర్ లాయర్

న్యూఢిల్లీ: ముస్లిం మహిళలు సంప్రదాయబద్ధంగా ధరించే హిజబ్‌ను పాఠశాలలు, విద్యాసంస్థల్లో నిషేధిచింన అంశం- దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. పాఠశాల విద్యార్థినులు సైతం హిజబ్ ధరించడాన్ని నిషేధించింది. దీనిపై కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళనలు సైతం చోటు చేసుకున్నాయి. రెండు వర్గాలు ఘర్షణలు దిగిన సందర్భాలు లేకపోలేదు.

హిజబ్ ధరించి.. కళాశాలల్లో తరగతులకు హాజరు కావడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు సైతం సమర్ధించింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు వెలువడించింది. దీని తరువాత బీజేపీ అధికారంలో ఉన్న మరి కొన్ని రాష్ట్రాలు దీన్ని నిషేధించే దిశగా అడుగులు వేశాయి గానీ అవి పెద్దగా ఫలించలేదు.

ఇప్పుడు తాజా ఈ అంశం మరోసారి వార్తల్లోకెక్కింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. దీనికి ప్రధాన కారణం- ఈ హిజబ్ నిషేధం వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కడమే. హిజబ్ నిషేధం విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి అనుకూలంగా అక్కడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులు పలో పిటీషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చేవారం లిస్టింగ్ చేసింది.

Hijab ban: Supreme Court to hear the petitions challenging the Karnataka HCs judgment

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని బెంచ్.. విచారణ చేపట్టనుంది. పిటీషన్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ తన వాదనలను వినిపించనున్నారు. నిజానికి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ ఏడాది మార్చిలోనే సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి గానీ.. అవి లిస్టింగ్ కాలేదు. విచారణకు స్వీకరించలేదు. ఇవ్వాళ మళ్లీ ఒకట్రెండు తాజా పిటీషన్లు దాఖలయ్యాయి.

ఈ సందర్భంగా ప్రశాంత్ భూషణ్- ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్యాసంస్థల్లో హిజబ్‌ను నిషేధించడాన్ని సవాల్ చేస్తూ పిటీషన్లు దాఖలైన విషయాన్ని గుర్తు చేశారు. అవి ఇప్పటి వరకు లిస్టింగ్ కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అత్యవసరంగా వీటిపై వాదోపవాదాలను వినాలని విజ్ఞప్తి చేశారు. బెంచ్ మాత్రం భిన్నంగా స్పందించింది. ఇప్పటికిప్పుడు అత్యవసరంగా వాటిని విచారించాల్సిన అవసరం కనిపించట్లేదని, వచ్చేవారం లిస్టింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ బెంచ్ విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+