Hijab Row: ఎందుకు పెద్దది చేస్తున్నారు ?, ఇదేమైనా జాతీయ సమస్య, అంత అర్జెంటా ? సుప్రీం కోర్టు!
న్యూఢిల్లీ/ బెంగళూరు: హిజాబ్ వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లింది. హిజాబ్ వివాదంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కొందరు ముస్లీం కాలేజ్ అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హిజాబ్ వివాదం పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చెయ్యాలని కాలేజ్ అమ్మాయిల తరుపు వాదిస్తున్న న్యాయవాది సుప్రీం కోర్టుకు మనవి చేశారు. హిజాబ్ వివాదం పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చెయ్యడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు చెప్పింది.
కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము పరిశీలిస్తున్నామని, ఇది జాతీయ స్థాయి వివాదం కాదు, దీనిని జాతీయ స్థాయి వివాదం చెయ్యకూడదని అత్యవసర పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకుంటామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి. రమణ అన్నారు. మీరు ఈ విషయ్యాన్ని జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరించకూడదని అమ్మాయిల తరుపు వాదిస్తున్న పిటిషనర్ తరపు న్యాయవాదికి సుప్రీం కోర్టు సూచించింది.

హిజాబ్, కాషాయ కండువాలు పక్కన పెట్టండి
కర్ణాటకలోని ఉడిపి రాలేజ్ ప్రిన్సిపాల్ కాలేజ్ అమ్మాయిలు హిజాబ్ ధరించకూడదని సూచించారు. ఉడిపి కాలేజ్ ప్రిన్సిపల్ దేశాలను సవాలు చేస్తూ కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కాలేజ్ ల్లో హిజాబ్, బుర్కాలు, కాషాయ కండువాలు ధరించకూడదని, కాలేజ్ యూనిఫామ్ మాత్రం వేసుకోవలని కర్ణాటక హైకోర్టు సూచించింది.

శాంతిని కాపాడండి
హిజాబ్, కాషాయ కండువాల వివాదం ముందు పెట్టుకుని ఎవ్వరూ శాంతికి భంగం కలిగించేలా ప్రవర్తించకూడాదని కర్ణాటక హైకోర్టు సూచించింది. కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు చదువు మీద శ్రద్ద పెట్టాలని, అంతే కాని ఇలాంటి వివాదాల విషయంలో అనవసరంగా రాద్దాంతం చెయ్యకూడదని పలువురు న్యాయనిపుణలు సూచించారు.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన అమ్మాయిలు
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కొందరు కాలేజ్ అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మేము కాలేజ్ ల్లో హిజాబ్ ధరించడానికి అవకాశం ఇవ్వాలని కాలేజ్ అమ్మాయిలు సుప్రీంకోర్టుకు మనవి చేశారు. కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.

వెంటనే విచారణ చెయ్యాలని మనవి
హిజాబ్ (బుర్కా) వివాదం పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చెయ్యాలని కాలేజ్ అమ్మాయిల తరుపు వాదిస్తున్న న్యాయవాది సుప్రీం కోర్టుకు మనవి చేశారు. హిజాబ్ ల వివాదం విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని కాలేజ్ అమ్మాయిల తరుపు న్యాయవాది సుప్రీం కోర్టులో ఒత్తిడి చేశారు. హిజాబ్ వివాదం పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చెయ్యడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు చెప్పింది.

హిజాబ్ ను జాతీయ సమస్య చెయ్యకూడదు
కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము పరిశీలిస్తున్నామని, ఇది జాతీయ స్థాయి వివాదం కాదు, దీనిని జాతీయ స్థాయి వివాదం చెయ్యకూడదని అత్యవసర పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకుంటామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి. రమణ అన్నారు.
మీరు ఈ విషయ్యాన్ని జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరించకూడదని అమ్మాయిల తరుపు వాదిస్తున్న పిటిషనర్ తరపు న్యాయవాదికి సుప్రీం కోర్టు సూచించింది. కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదాన్ని ఢిల్లీ వరకు తీసుకురావడం సరైనదేనా ?, తప్పు జరిగితే మేము జోక్యం చేసుకుంటాము కాదా, మీరే ఆలోచించిండి అంటూ సుప్రీం కోర్టు అమ్మాయల తరుపు న్యాయవాదిని ప్రశ్నించారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications