Hijab Row-Karnata Bandh-హిజాబ్ వివాదంపై నేడు కర్నాటక బంద్-హోలీ తర్వాతే సుప్రీం విచారణ
కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం చినికిచినికి గాలివానై ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. అక్కడి బీజేపీ సర్కార్ హిజాబ్ కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాస్తా హైకోర్టుకు చేరి అక్కడ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీన్ని నిరసిస్తున్న ముస్లిం సంఘాలు.. ఇవాళ కర్నాటక బంద్ కు పిలుపునిచ్చాయి.
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని ముస్లిం సంస్థలు ఇవాళ రాష్ట్రంలో బంద్‌కు పిలుపునిచ్చాయి. క్లాస్‌రూమ్‌ల్లోకి హిజాబ్‌ను అనుమతించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో దీనికి నిరసనగా ఈ బంద్ చేపట్టారు. హిజాబ్ ధరించడం ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లం సంఘాలు మండిపడుతున్నాయి

కర్ణాటకకు చెందిన అమీర్-ఇ-షరియత్, మౌలానా సాగిర్ అహ్మద్ ఖాన్ రషాదీ రాష్ట్రవ్యాప్త బంద్‌కు ఇచ్చిన పిలపుకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది సంస్థలు మద్దతు ఇచ్చాయి. హిజాబ్‌కు సంబంధించి కర్ణాటక హైకోర్టు విచారకరమైన ఆదేశాలకు వ్యతిరేకంగా మా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్త బంద్ పాటిస్తున్నట్లు ముస్లి సంఘాల పెద్దలు ప్రకటించారు. బంద్‌కు మొత్తం ముస్లిం సమాజం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సిఎఫ్‌ఐ) కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. హైకోర్టు తీర్పు ఒక వ్యక్తి రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని రెండు సంస్థలు విమర్శిస్తున్నాయి. హైకోర్టు తీర్పు వ్యక్తిగత, మతపరమైన హక్కులకు విరుద్ధమని చెప్తున్నాయి. అయితే, క్లాస్‌రూమ్‌లలో హిజాబ్‌ను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను కొట్టివేస్తూ హైకోర్టు ప్రత్యేక బెంచ్ తీర్పు వెలువరించడంతో కర్ణాటకలోని కొన్ని నిరసనలు మినహాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి.
Recommended Video

మరోవైపు కర్నాటక హైకోర్టు తీర్పుపై ముస్లిం విద్యార్ధినులు చేసుకున్న అప్పీళ్లపై సుప్రీంకోర్టు హోలీ తర్వాతవిచారణ చేపట్టబోతోంది. మార్చి 21న హోలీ సెలవుల తర్వాత సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లు లిస్ట్ అయ్యే అవకాశముంది. అప్పటివరకూ వేచి చూడాలని సీజేఐ జస్టిస్ రమణ తెలిపారు.












Click it and Unblock the Notifications