Hijab row: బుర్కాల వివాదం, మా ఆదేశాలకు కట్టుబడి ఉన్నాము, సీఎం క్లారిటీ, రాజ్యంగంలో ఉండేదే !
బెంగళూరు: స్కూల్, కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు ధరించే హిజాబ్ (బుర్కాలు) ల వివాదం చిలికి చిలికి గానవానలా తయారై ఇప్పుడు తుపానులా మారుతోంది. విద్యాసంస్థల్లో ముస్లీం అమ్మాయిలు బుర్కాలు వేసుకుని వస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని నుదిటి మీద సింధూరం పెట్టుకుని కాలేజ్ లోకి వస్తామని హిందులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఉడిపిలో మొదలైన బుర్కాల వివాదం తరువాత కర్ణాటకకు వ్యాపించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం ఇదే విషయంలో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఇప్పుడు బుర్కాల వివాదంపై మొదటి సారి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ స్పంధించారు. కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు మేము కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజ్ ల్లో అందరిని సమానంగా చూడాలని మేము ఆదేశాలు జారీ చేశామని, ఈ విషయంలో మేము స్పష్టంగా ఉన్నామని, రాజ్యంగంలోని చట్టలాను అనుసరించి మేము నడుచుకుంటున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

ఇక్కడ మొదలైయ్యింది
కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు బుర్కా (హిజూబ్) ధరించి కాలేజ్ కు రాకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజుల నుంచి బుర్కాలు వేసుకుని వస్తున్న కాలేజ్ అమ్మాయిలకు కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు అడ్డుకుంటున్నారని కాలేజ్ అమ్మాయిలు ఆరోపించి ఆందోళనకు దిగారు.

సింధూరం, జైశ్రీరామ్ నినాదాలు
విద్యాసంస్థల్లో ముస్లీం అమ్మాయిలు బుర్కాలు వేసుకుని వస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని నుదిటి మీద సింధూరం పెట్టుకుని కాలేజ్ లోకి వస్తామని హిందులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఉడిపిలో మొదలైన బుర్కాల వివాదం తరువాత కర్ణాటకకు వ్యాపించింది.

హైకోర్టు ఎంట్రీతో నోటీసులు
ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లో చదువుతున్న ఆయేషా హజీరా అల్మాస్, రేషమ్ ఫారుక్, ఆలియా అస్సాది, శఫా, షమీమ్, ముస్తఫా జైనబ్ తదితరుల తరపున న్యాయవాది మోహమ్మద్ తాహీర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ కాలేజ్ విద్యార్థినిలు సమర్పించిన పిటిషన్ విచారణ చేసిన న్యాయమూర్తి కృష్ణ ఎస్. దీక్షిత్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ కర్ణాటక ప్రభుత్వంతో పాటు సంబంధిత కాలేజ్ ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులు అందరికి నోటీసులు జారీ చేసింది.

ఎమ్మెల్యే మీద విరుచుకుపడిన విద్యార్థులు
ఉడిపి ఎమ్మెల్యే రఘపతి భట్ ప్రభుత్వ కాలేజ్ లో ఎక్కువగా పెత్తనం చేస్తున్నారని, ఆయన బీజేపీ నాయకుడని, ఆయన రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకుంటున్నారని కొందరు అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే రఘుపతి భట్ ఆడినట్లు కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆడుతున్నారని ముస్లీం అమ్మాయిల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో హిజాబ్ వివాదంతో కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

రాహుల్ గాంధీ ఫైర్
చదువుల తల్లి సరస్వతి దేవి హిందువులు, ముస్లీంలు అని ఎప్పుడు తేడాలు చూపించదని, మనం చూపించే తేడాలు సరస్వతి తల్లి మీద వేస్తున్నామని, భరతమాత ముద్దుబిడ్డలైన అమ్మాయిలను విభజించి వారి హక్కులను మనం దోచుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ స్వార్థం కోసం విద్యార్థలు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రాహుల్ గాంధీ ఇప్పటికే తీవ్రవస్థాయిలో మండిపడ్డారు.

క్లారిటి ఇచ్చిన సీఎం బోమ్మయ్
బుర్కాల వివాదంపై మొదటి సారి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ స్పంధించారు. కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు మేము కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజ్ ల్లో అందరిని సమానంగా చూడాలని మేము ఆదేశాలు జారీ చేశామని, ఈ విషయంలో మేము స్పష్టంగా ఉన్నామని, రాజ్యంగంలోని చట్టలాను అనుసరించి మేము నడుచుకుంటున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
Recommended Video

కుదరదని చెప్పిన సీఎం, మంత్రి
ప్రభుత్వ కాలేజ్ లు, పాఠశాలల్లోకి ఎవ్వరూ కూడా బుర్కాలు వేసుకుని వస్తామని కాని, సింధూరం పెట్టుకుని కాషాయం కండువాలు వేసుకుని వస్తే కుదరదని పరోక్షంగా సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలు, కాలేజ్ లో విద్యార్థులు అందరిని సమానంగా చూస్తామని, ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశామని కర్ణాటక విద్యశాఖా మంత్రి నాగేష్ మీడియాకు చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications