బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab: మా హక్కుల మాకు కల్పించండి, సౌత్ ఆఫ్రికా కేసు తీర్పు చూడండి, హైకోర్టు విచారణ వాయిదా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో వాడివేడిగా చర్చ జరిగింది. భారతదేశంలోని వివిద రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి పిటిషన విచారణ తీర్పుల వివరాలను హిజాబ్ కావాలని పిటిషన్లు వేసిన అమ్మాయిల తరపు న్యాయవాది కర్ణాటక హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇదే సమయంలో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఇలాంటి సంఘటన కేసు విచారణ తీర్పును కర్ణాటక హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. హైకోర్టులో విచారణ ప్రారంభం అయిన తరువాత ముస్లీం అమ్మాయిల తరుపు వాదిస్తున్న న్యాయవాది ఎక్కువ సమయం వాదించారు. హిజాబ్ వేసుకోకుండా ముస్లీం అమ్మాయిలు ఎలా చదువుకుంటారని ముస్లీం అమ్మాయిల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ప్రభుత్వ నియమాల ప్రకారం యూనీఫామ్ వేసుకుంటున్నారని, తరువాత హిజాబ్ దరిస్తామని ముస్లీం విద్యార్థులు కోరుతున్నారని అమ్మాయి తరుపు న్యాయవాది కోర్టులో మనవి చేశారు. మంగళవారం కూడా హైకోర్టులో వాదనలు పూర్తి కాలేదు. ఇదే సమయంలో కర్ణాటక వ్యాప్తంగా ముస్లీం అమ్మాయిలు ఆందోళనకు దిగారు. హిజాబ్ లేకుండా మేము క్లాస్ రూమ్ లో అడుగు పెట్టమని తేల్చి చెబుతున్నారు. మంగళవారం కూడా హైకోర్టులో వాదనలు పూర్తి కాకపోవడంతో బుధవారం మద్యాహ్నం 2.30 గంటలకు పిటిషన్ విచారణ వాయిదాపడింది.

Recommended Video

Hijab పై SC సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు Supreme Court On Hijab Hearing | Oneindia Telugu

Hijab: హైకోర్టు చెప్పినా మామూలే, గేట్ లోనే హిజాబ్ లు తీపించిన పోలీసులు, ఇంటికి రిటన్ !Hijab: హైకోర్టు చెప్పినా మామూలే, గేట్ లోనే హిజాబ్ లు తీపించిన పోలీసులు, ఇంటికి రిటన్ !

కోర్టు తీర్పులను గుర్తు చేసిన న్యాయవాది

కోర్టు తీర్పులను గుర్తు చేసిన న్యాయవాది

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో వాడివేడిగా చర్చ జరిగింది. భారతదేశంలోని వివిద రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి పిటిషన విచారణ తీర్పుల వివరాలను అమ్మాయిల తరపు న్యాయవాది దేవదత్ కామత్ కర్ణాటక హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. గతంలో హిజాబ్ లు వేసుకోవడానికి కోర్టులు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఇదే సమయంలో అమ్మయిల తరపు న్యాయవాది దేవదత్ కామత్ కర్ణాటక హైకోర్టులో చెప్పారు.

సౌత్ ఆఫ్రికా కోర్టు తీర్పు గుర్తు చేసిన న్యాయవాది

సౌత్ ఆఫ్రికా కోర్టు తీర్పు గుర్తు చేసిన న్యాయవాది

2004లో సౌత్ ఆఫ్రికాలోని ఓ స్కూల్ లో ఓ విద్యార్థి ముక్కుకు అలాంకారం చేసుకుందని (ముక్కు పుడక) స్కూల్ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముక్కుకు అలంకారం చేసుకోకూడదని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో ఇది మా రాజ్యంగం హక్కు అంటూ ఆ అమ్మాయి కోర్టుకు వెళ్లిందని ఇదే సమయంలో న్యాయవాది దేవదత్ కామత్ గుర్తు చేశారు.

అక్కడ అమ్మాయిదే విజయం

అక్కడ అమ్మాయిదే విజయం


చివరికి స్కూల్ లో చదువుతున్న అమ్మాయి ముక్కుకు అలంకారం చేసుకోవచ్చని, ఇది స్కూల్ యూనీఫామ్ కు అడ్డుకాదని సౌత్ ఆఫ్రికా కోర్టు తీర్పు ఇచ్చిందని, ఇక్కడ కూడా స్కూల్, కాలేజ్ యూనీఫామ్ కు హిజాబ్ అడ్డుకాదని ముస్లీం అమ్మాయిల తరుపు న్యాయవాది దేవదత్ కామత్ కర్ణాటక హైకోర్టులో చెప్పారు.

ప్రాథమిక హక్కులు కల్పించండి

ప్రాథమిక హక్కులు కల్పించండి


యూనీఫామ్ లు ఇలాగే వేసుకోవాలని చెప్పే హక్కు విద్యాసంస్థల సలహా మండలికి కాని, అభివృద్ది కమిటీలకు ఉండవని, ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ముస్లీం అమ్మాయిల తరుపు న్యాయవాది దేవదత్ కామత్ హైకోర్టులో చెప్పారు. హిజాబ్ లు దరించి తరగతులకు హాజరుకావడానికి ముస్లీం అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలని న్యాయవాది దేవదత్ కామత్ కర్ణాటక హైకోర్టులో మనవి చేశారు. మంగళవారం కూడా హైకోర్టులో వాదనలు పూర్తి కాకపోవడంతో బుధవారం మద్యాహ్నం 2.30 గంటలకు పిటిషన్ విచారణ వాయిదాపడింది.

English summary
Hijab Row: Karnataka High Court adjourns Hijab hearing for Wednesday afternoon 2.30 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X