బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab Row: హిజాబ్ లు ముఖ్యం కాదు, పరీక్షలు ముఖ్యం అని చెప్పిన ముస్లీం అమ్మాయిలు, ఇంటికి వెళ్లి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులు కచ్చితంగా యూనీఫామ్ వేసుకుని రావాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఎవ్వరూ మతపరమైన దుస్తులు, వస్త్రాలు వేసుకుని పరీక్షలకు హాజరుకాకూడదని విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. హిజాబ్ లు వేసుకుని 10వ తరగతి పరీక్షలకు హాజరుకాకూడదని, హిజాబ్ లు వేసుకుని వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని, కర్ణాటక హైకోర్టు ఆదేశాలను అందరూ కచ్చితంగా పాటించాలని విద్యాశాఖా అధికారులు తేల్చి చెప్పారు. సోమవారం కొందరు ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని పరీక్షలు రాయడానికి వెళ్లారు. పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక గదుల్లో హిజాబ్ లు తొలగించిన ముస్లీం అమ్మాయిలు యూనీఫామ్ మాత్రమే వేసుకుని పరీక్షలు రాశారు. కొన్ని చోట్ల పరీక్షా కేంద్రాల నుంచి ఇంటికి వెనుతిరిగి వెళ్లిన ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు తీసేసి యూనీఫామ్ వేసుకుని వెళ్లి 10వ తరగతి పరీక్షాలు రాశారు. మాకు హిజాబ్ లు ముఖ్యం కాదని, పరీక్షలు ముఖ్యం అని ముస్లీం అమ్మాయిలు, వాళ్ల కుటుంబ సభ్యులు పరీక్షా కేంద్రాల దగ్గర మీడియాకు చెప్పారు. కర్ణాటకలో 10వ తరగతి రాస్తున్న విద్యార్థులు కర్ణాటక హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటిస్తున్నారు.

Revenge: మోదీ, సీఎం వీరాభిమాని, ముస్లీం యువకుడిని వెంటాడి నరికి చంపిన ముస్లీం యువకులు, అప్పుడే !Revenge: మోదీ, సీఎం వీరాభిమాని, ముస్లీం యువకుడిని వెంటాడి నరికి చంపిన ముస్లీం యువకులు, అప్పుడే !

10వ తరగతి పరీక్షలు

10వ తరగతి పరీక్షలు


కర్ణాటకలో 2021-22 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు ఎవ్వరూ మతపరమైన దుస్తులు, వస్త్రాలు వేసుకుని పరీక్షలకు హాజరుకాకూడదని విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ప్రతిఒక్కరూ కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ అధికారులు మనవి చేశారు.

హైకోర్టు ఆదేశాలు పాటించాలి

హైకోర్టు ఆదేశాలు పాటించాలి

ఇటీవల కలకలం రేపిన హిజాబ్ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. హిజాబ్ లు వేసుకుని 10వ తరగతి పరీక్షలకు హాజరుకాకూడదని, హిజాబ్ లు వేసుకుని వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని విద్యాశాఖా అధికారులు తేల్చి చెప్పారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ అధికారులు మనవి చేశారు.10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

 హిజాబ్ లు తీసేసిన ముస్లీం అమ్మాయిలు

హిజాబ్ లు తీసేసిన ముస్లీం అమ్మాయిలు

సోమవారం మైసూరు జిల్లాలో కొందరు ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని పరీక్షలు రాయడానికి వెళ్లారు. పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక గదుల్లో హిజాబ్ లు తొలగించిన ముస్లీం అమ్మాయిలు యూనీఫామ్ మాత్రమే వేసుకుని పరీక్షలు రాశారు. మైసూరు జిల్లాలో మొత్తం 35 వేల మంది అమ్మాయిలు పరీక్షలు రాశారు. మైసూరు జిల్లాలో చాలా చోట్ల ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు తొలగించి పరీక్షలకు హాజరైనారు.

 ఇంటికి పంపించిన అధికారులు

ఇంటికి పంపించిన అధికారులు

దావణగెరెలోని పరీక్షా కేంద్రాల నుంచి ఇంటికి వెనుతిరిగి వెళ్లిన ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు తీసేసి యూనీఫామ్ వేసుకుని వెళ్లి 10వ తరగతి పరీక్షాలు రాశారు. బెంగళూరులోని రాజాజీనగర్ లో కూడా కొందరు ముస్లీం అమ్మాయిలు ఇంటికి వెళ్లి హిజాబ్ లు తీసేసి యూనీఫామ్ వేసుకుని వెళ్లి పరీక్షలు రాశారు. కర్ణాటకలో పలు చోట్ల హిజాబ్ లు వేసుకుని వెళ్లిన అమ్మాయిలు పరీక్షా కేంద్రాల్లోని ప్రత్యేక గదుల్లో హిజాబ్ లు తీసేసి వెళ్లి పరీక్షలు రాశారు.

హిజాబ్ లు ముఖ్యం కాదు..... పరీక్షలు ముఖ్యం

హిజాబ్ లు ముఖ్యం కాదు..... పరీక్షలు ముఖ్యం

మాకు హిజాబ్ లు ముఖ్యం కాదని, పరీక్షలు ముఖ్యం అని ముస్లీం అమ్మాయిలు, వాళ్ల కుటుంబ సభ్యులు పరీక్షా కేంద్రాల దగ్గర మీడియాకు చెప్పారు. కర్ణాటకలో 10వ తరగతి రాస్తున్న విద్యార్థులు కర్ణాటక హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల్లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేసి మతపరమైన వివాదాలు రెచ్చగొట్టే వాళ్ల మీద గట్టి నిఘా వేశారు.

 ప్రత్యేక టీమ్ లు నియమించిన ప్రభుత్వం

ప్రత్యేక టీమ్ లు నియమించిన ప్రభుత్వం

కరోనా వైరస్ మహమ్మారి శాంతించడంతో ఈ సంవత్సరం 8. 73 వేల మంది విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రాలకు హాజరై 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్దం అయ్యారు, 4, 52, 732 మంది అబ్బాయిలు, 4, 21, 110 మంది అమ్మాయిలు, 4, 518 మంది తృతీయ లింగ విద్యార్థులు పరీక్షలకు రాయడానికి సిద్దం అయ్యారు. మార్చి 28వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్11వ తేదీ వరకు కర్ణాటకలో 10వ తరగతి పరీక్షలు రాయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 10వ తరగతి పరీక్షలు సజవుగా సాగడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక అధికారులు, స్వ్కాడ్ ను నియమించింది.

English summary
Hijab Row: The SSLC examination has commenced from today and students are following the High Court rule in schools across the state. Students remove Hijab is being entry into the testing centers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X