వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిమాచల్‌ప్రదేశ్అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్‌కు షాక్, తమ పార్టీ గెలిచిందన్న ధుమాల్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Himachal Pradesh Election Results : హిమాచల్‌ప్రదేశ్ లో బీజేపీ హవా..!

సిమ్లా: దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న బీజేపీ కంచుకోట గుజరాత్ తోపాటు హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం 8గంటల నుంచి వెలువడుతునున్నాయి. ఇప్పటికే ఓపినియన్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకే పట్టం కట్టినప్పటికీ ఫలితాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. తొలి నుంచి కూడా బీజేపీ ఆధిక్యతను కనబరుస్తోంది.

ఫలితాలు:

బీజేపీ-44 గెలుపు

కాంగ్రెస్-21 గెలుపు

ఇతరులు-3 గెలుపు

బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓడిపోవడంతో సీఎం అభ్యర్థిగా కేంద్రమంత్రి జేపీ నడ్డాను ప్రకటించారు.

ఇప్పటి వరకు నోటాకు 0.9శాతం అంటే 33,290 ఓట్లు పడటం గమనార్హం.

గుజరాత్, హిమాచ్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఊహించిందేనని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కాగా, పార్లమెంటుకు వచ్చిన ప్రధాని మోడీ విక్టరీ సింబల్ చూపుతూ లోనికి వెళ్లారు.

బీజేపీ సీఎం అభ్యర్థి ఓటమి

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తున్నప్పటికీ ఆ పార్టీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ మొదట వెనుకంజలో ఉన్నప్పటికీ తర్వాత ఆధిక్యంలోకి వచ్చారు. అయితే, చివరకు ఓటమిపాలయ్యారు. కాగా, ఈయనపై సుజన్పూర్ నుంచి రాజ్ కుమార్ రానా పోటీ చేశారు.

కాగా, హిమాచల్ ప్రదేశ్ సీఎం కుమారుడు విక్రమాదిత్య ముందంజలో ఉన్నారు.

మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 42 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 68అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 35 సీట్లు వచ్చిన పార్టీ అధికారం చేపట్టనుంది.

కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున అధికారాన్ని దక్కించుకుంటూ వస్తున్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఈసారి మాత్రం బీజేపీవిజయమని అంచనాలు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం గెలుపై తన ధీమాను వ్యక్తం చేస్తోంది.

Himachal Pradesh Election Results 2017 LIVE: Counting of votes to begin at 8 am

ఎగ్జిట్‌పోల్స్‌ సరైనవి కావనీ, ఈసారి విజయం నిస్సందేహంగా తమదేనని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ సహా కాంగ్రెస్‌ నేతలంతా అంటున్నారు. 75% పైగా పోలింగ్‌ జరిగిన ఈ రాష్ట్రంలో 68 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును 42 కేంద్రాల్లో చేపట్టనున్నారు. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని మొత్తం నాలుగుస్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

2012 హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే..
మొత్తం 68స్థానాల్లో..
కాంగ్రెస్- 36 స్థానాల్లో గెలుపు
బీజేపీ- 26స్థానాల్లో గెలుపు
ఇతరులు- 6స్థానాల్లో గెలుపు
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 42.81ఓట్లశాతం లభించగా, బీజేపీకి 38.47శాతం ఓట్లు లభించాయి.

English summary
The fate of 337 candidates including Chief Minister Virbhadra Singh and his predecessor Prem Kumar Dhumal will be known today as counting of votes will take place in Himachal Pradesh where traditional rivals BJP and Congress have contested all 68 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X