వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిమాచల్ ప్రదేశ్ పోల్:66 శాతం పోలింగ్, మంచులో కూడా బారులు, వృద్దులు

|
Google Oneindia TeluguNews

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి పోలింగ్ ముగిసింది. మొత్తం 66 శాతం ఓటింగ్ నమోదైంది. హిల్ స్టేషన్ సిమ్లాలో ఓటు వేసేందుకు జనాలు ఆసక్తి చూపించారు. మంచు దుప్పటి కమ్ముకున్న ఓటు వేసేందుకు జనం కదిలి వచ్చారు. మంచు ప్రభావం.. చలి తీవ్రతతో ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత పుంజుకుంది. తొలి గంటలో కేవలం 5 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఉదయం 11 గంటలకు అదీ 17.98 శాతంగా ఉంది. మధ్యాహ్నం 1 గంటకు 37.19గా ఉంది. 3 గంటలకు 55.65 శాతంగా ఉంది.సాయంత్రం 5 గంటల వరకు 65.92 శాతంగా ఉంది.

సిర్మైర్ జిల్లాలో అత్యధికంగా 72.35 శాతం పోలింగ్ జరిగింది. ఆ తర్వాత సోలాన్‌లో 68.48 శాతం, ఉనాలో 67.67 శాతం, లాహౌల్‌లో 67.5 శాతం, స్పిటిలో కూడా సేమ్ ఇంతే నమోదయ్యింది. ఈ రెండు చోట్ల 1 గంట వరకు 21.95 శాతంగా పోలింగ్ జరిగింది. ఆ తర్వాతే పుంజుకుంది.

 Himachal Pradesh poll:Nearly 66% polling as voters brave cold

సిల్లైలో అత్యధికంగా 77 శాతం, సర్కఘాట్‌లో 55.40 శాతం పోలింగ్ నమోదైంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరజ్ నియోజకవర్గంలో గల సుజన్ పూర్‌లో 74 శాతం పోలింగ్ జరిగింది. శతాధిక వృద్దులు కూడా ఓటేశారు. నరో దేవి (105) కాక, సర్దార్ ప్యార్ సింగ్ (103) కూడా ఓటు వేశారు.

హిమాచల్ ప్రదేశ్‌‌లో 1.21 లక్షల మంది 80 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. శతాధిక వృద్దులు 1136 ఉన్నారు. వారి కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలాగే వికలాంగులకు కూడా ఏర్పాట్లు చేసింది.

English summary
Himachal Pradesh recorded voter turnout of nearly 66% on November 12, Election Commission said citing provisional polling figures till 5 pm for the Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X