వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిమాచల్ సరే! కమలానిదే: గుజరాత్‌లో భిన్నం.. యువనేతల స్పీడ్‌తో జాతకాలు మారతాయా?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాలక, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాల గణాంకాలు రోజు రోజుకు మారుతున్నాయి. వచ్చేనెలలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి అనూహ్య ఎదురుదాడి జరుగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో తుడిచిపెట్టుకు పోయిందన్న వ్యాఖ్యలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి తలెత్తుకుని దూసుకొచ్చే స్థాయికి చేరుకున్నది. దీనికి పాటిదార్ రిజర్వేషన్ల పోరాట నాయకుడు హార్దిక్ పటేల్, ఓబీసీల హక్కుల పరిరక్షక నాయకుడు అల్ఫేశ్ ఠాకూర్, దళిత హక్కుల కార్యకర్త జిగ్నేశ్ మేవానీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణంగా మారారు.

Recommended Video

Gujarat Assembly Elections : మోడీకి యువ నేతల దడ, వాళ్ళెవరో కాదు !

ఈ నెల తొమ్మిదో తేదీన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం ఖాయమని బీజేపీ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో తేలింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రణాళిక రచించలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో మాత్రం బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి తొలిసారి గట్టి సవాల్ ఎదురవుతోంది.

 ‘హజ్'గా విపక్ష కూటమి.. ‘రామ్'గా అధికార బీజేపీ

‘హజ్'గా విపక్ష కూటమి.. ‘రామ్'గా అధికార బీజేపీ

182 అసెంబ్లీ స్థానాలు గల గుజరాత్ అసెంబ్లీలో 70 స్థానాల్లో ఓబీసీల మద్దతు కీలకం. హార్దిక్ పటేల్ - అల్పేశ్ ఠాకూర్ - జిగ్నేశ్ మేవానీలతో కూడిన త్రిమూర్తుల వంటి యువ నేతలను రాజకీయ పరిశీలకులు ‘హజ్' అని వ్యంగ్యంగా సంబోధించారు. ఇలా ‘హజ్' వల్ల దాదాపు 60 శాతం ఓటర్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తోంది. దీనికి ప్రతిగా బీజేపీలో ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీలతో కూడిన ‘రూపానీ - అమిత్ షా - మోదీ'లతో కూడిన జోడీ.. ‘రామ్' త్రిమూర్తులను కమలనాథులు ముందుకు తెచ్చారు.

 ఆలస్యమైనా ధుమాల్‌కే రాష్ట్ర ప్రజల పట్టం?

ఆలస్యమైనా ధుమాల్‌కే రాష్ట్ర ప్రజల పట్టం?

యాపిల్ తోటలకు నిలయమైన పర్వత శ్రేణి రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్‌లో అవినీతి మయమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనుక హిమాచల్ ప్రదేశ్‌పై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదిలేసుకున్నది. బీజేపీ ప్రధాన నాయకత్వం.. మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్‌ను ఆలస్యంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించినా.. సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న జేపీ నడ్డా తన ఆశలు వదులుకోకున్నా, వయస్సు దాటిన సీనియర్ నాయకుడు శాంతాకుమార్ వల్ల కాంగ్రెస్ పార్టీ నేత, సీఎం ‘రాజా' వీరభద్ర సింగ్ ఆశలు సాయపడే అవకాశాలు కనిపించడం లేదు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా నిర్వహించారు. ‘కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బెయిల్‌పై ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రతీదీ బెయిల్ పైనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వాధినేతలు బెయిల్‌పైనే ఉన్నారు' అని మోదీ ధ్వజమెత్తారు. కాకపోతే నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ప్రజలు, ప్రత్యేకించి యాపిల్ ఉత్పత్తిదారులు, వ్యాపారులు ఎదుర్కొన్న ఇబ్బందులే తనను గట్టెక్కిస్తాయని వీరభద్ర సింగ్ తలపోస్తున్నారు.

 సర్వేలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాతావరణం

సర్వేలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాతావరణం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలపై ఏబీపీ - లోక్‌నీతి - సీఎస్‌డీఎస్‌ గత ఆగస్టులో, అక్టోబర్‌ నెలల్లో నిర్వహించిన ఎన్నికల సర్వేల్లోనే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతాగస్టులో నిర్వహించిన సర్వేలో పాలకపక్ష బీజేపీకి 60 శాతం ఓట్లు వస్తాయని తేలగా, అక్టోబర్‌లో నిర్వహించిన సర్వేలో అది 47 శాతానికి పడిపోయింది. అదే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు 12 శాతం ఓట్లు పెరిగాయి. గుజరాత్‌ పోలింగ్‌కు మరో 30 రోజులు ఉండడంతో పాలక, ప్రతిపక్షాల గెలుపొటముల గణాంకాలు తారుమారయ్యే పరిస్థితి కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. తొలుత నిర్వహించిన ఎన్నికల సర్వేల్లో కాంగ్రెస్ ‌- సమాజ్‌వాదీ పార్టీల కూటమి విజయం సాధిస్తుందని తేలింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోటీ పోటాపోటీగా మారింది. తీరా పోలింగ్‌ నాటికి పరిస్థితి బీజేపీకి పూర్తి అనుకూలంగా మారిపోయింది. ఇప్పుడు గుజరాత్‌లో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 జీఎస్టీని వ్యతిరేకిస్తున్న వారే ఎక్కువ

జీఎస్టీని వ్యతిరేకిస్తున్న వారే ఎక్కువ

రెండు దశాబ్దాలకుపైగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. పెద్ద నోట్ల రద్దు, ఇటీవలి జీఎస్టీ వల్ల గుజరాత్‌ వ్యాపార వర్గం తీవ్రంగా దెబ్బతిన్నది. వారంతా తొలి నుంచి బీజేపీ అనుకూలురు అవడంతో వారు పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటేయరనే అందరూ భావించారు. వారిలో కూడా స్పష్టమైన మార్పు వస్తున్నట్లు ఏబీపీ - లోక్‌నీతి - సీఎస్‌డీఎసస్‌ నిర్వహించిన సర్వే ఫలితాల సరళే స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా జీఎస్టీ కారణంగా వ్యాపారులు ఎక్కువ మంది పాలక పార్టీకి ఎదురు తిరుగుతున్నారు. ఆగస్టులో నిర్వహించిన సర్వేలో జీఎస్టీ నిర్ణయం మంచిదని 38 శాతం అభిప్రాయపడగా, ఫర్వాలేదని 22 శాతం మంది, మంచిదికాదని 25 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే అక్టోబర్‌ నెలలో నిర్వహించిన సర్వేలో మంచిదని 24 శాతం మంది ఫర్వాలేదని 29 శాతం మంది, మంచిది కాదని 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. మంచిదన్న అభిప్రాయం 14 శాతం పడిపోగా, చెడ్డదన్న శాతం 15 పెరిగింది.

 30 రోజుల్లో అంచనాలు తారుమారవుతాయా?

30 రోజుల్లో అంచనాలు తారుమారవుతాయా?

ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు పట్ల ప్రజలు గత మే నెలలో కేంద్రం పనితీరు పట్ల 75 శాతం మంది, రాష్ట్రం పనితీరు పట్ల 77 శాతం మంది సంత్రుప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు నెలలో కేంద్రం పట్ల 67 శాతం మంది, రాష్ట్రం పట్ల 69 శాతం మంది, అక్టోబర్‌ నెలలో కేంద్రం పట్ల 54 శాతం మంది, రాష్ట్రం పట్ల 57 శాతం మంది సంత్రుప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల కాలంలో కనిపించిన ఈ వ్యత్యాసాలు ఇలాగే కొనసాగితే 30 రోజుల్లోనే విజయావకాశాల అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. అందుకనే బీజేపీ పార్టీ, ప్రభుత్వాలు ఓటర్లపై వరాల వర్షం కురిపిస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే ఈ నెల తొమ్మిదో తేదీన ‘సీ - ఓటర్' అనే సంస్థ నిర్వహించిన సర్వేలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తేలింది. బీజేపీ 11.8 శాతం ఓట్లతో పట్టు సాధించగా, కాంగ్రెస్ పార్టీ ఐదు శాతం నోట్లు కోల్పోతుందని తేలింది. బీజేపీ ఓటు శాతం తగ్గినా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ‘సీ - ఓటర్' సర్వే తేల్చింది. ఇంతకు ముందు గత ఆగస్టులో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అహ్మద్ పటేల్ ఎన్నికను అడ్డుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని శివసేన పోటీ చేయడం వల్ల బీజేపీ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని భావిస్తున్నారు.

 యువ నేతలతో కాంగ్రెస్ పార్టీ కూటమి యత్నం

యువ నేతలతో కాంగ్రెస్ పార్టీ కూటమి యత్నం

జేడీయూ చీలిక వర్గం నేత చోటు వాసవ, పాస్ కన్వీనర్ హార్దిక్ పటేల్, ఏక్తా మంచ్ నేత అల్పేశ్ ఠాకూర్, దళిత హక్కుల కార్యకర్త జిగ్నేశ్ మేవానీలతో కూడిన విస్త్రుత కూటమి కట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో పటేళ్లు 16 శాతం, ఓబీసీలు 40 శాతం, దళితులు ఎనిమిది శాతం మంది ఉన్నారు. వీటితోపాటు ముస్లింలు మరో తొమ్మిది శాతం మంది ఉన్నారు. ఈ దఫా బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలు ఓటేయాలని భావిస్తున్నారు. అసెంబ్లీలోని 182 స్థానాల్లో కనీసం 70 స్థానాల్లో ఓబీసీలు, 30 నియోజకవర్గాల్లో ముస్లింలు, గిరిజనులు 25, దళితులు 10 - 13 స్థానాల పరిధిలో విజయావకాశాలను ప్రభావితం చేస్తారని భావిస్తున్నారు. 1960లో గుజరాత్ రాష్ట్ర ఆవిర్భావం సాధించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓబీసీలు మద్దతునిచ్చారు. 1985లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవ్ సింగ్ సోలంకి రూపొందించిన ‘ఖామ్' ఫార్ములాతో ఆ పార్టీకి 149 సీట్లు వచ్చాయి. కానీ దేశ వ్యాప్తంగా అయోధ్య ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఓబీసీలు హిందూత్వకు అనుకూలంగా బీజేపీకి ఓటేస్తూ వచ్చారు.

భూమి పుత్రుడు ‘మోదీ' చరిస్మా కలిసొస్తుందా?

భూమి పుత్రుడు ‘మోదీ' చరిస్మా కలిసొస్తుందా?

ప్రస్తుతం గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన కన్వీనర్ అల్పేశ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నూతన కుల సమీకరణాలు ముందుకు వచ్చాయి. అల్పేశ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తొలి నుంచి పార్టీకి సంప్రదాయంగా ఓటర్లు తిరిగి తమ పార్టీకి మద్దతుగా నిలుస్తారని రాహుల్ గాంధీ ఆశిస్తున్నారు. పాటిదార్లు, దళితులకు తోడు ఓబీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలువడంతోపాటు నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఆశలు గల్లంతయ్యాయి. ప్రత్యేకించి వ్యాపారులు నిరుత్సాహానికి గురయ్యారు. ఇబ్బందుల పాలయ్యారు. ఇక గుజరాతీల భూమి పుత్రుడిగా పేరొందిన ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న చరిస్మా తమకు కలిసి వస్తుందని కమలనాథులు ఆశిస్తున్నారు. వచ్చేనెల 9, 14 తేదీల్లో పోలింగ్ జరుగనున్నది. ఈ లోపు ప్రధాని నరేంద్రమోదీ కనీసం 30 సభల్లో ప్రసంగిస్తారని సమాచారం. పాటిదార్లు, ఓబీసీలు, దళితుల ఆందోళనల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంలో ఎన్నికల సంఘం అనుచిత జాప్యం చేసింది.

 210 వస్తువులపై జీఎస్టీ శ్లాబుల్లో సమూల మార్పులు ఇలా

210 వస్తువులపై జీఎస్టీ శ్లాబుల్లో సమూల మార్పులు ఇలా

ప్రజా వ్యతిరేకత ఫలితంగానే 2015 స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో విజయం సాధించగా, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును కాపాడుకున్నది. తాజాగా శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 210 ఐటమ్స్‌పై పన్ను శ్లాబులు తగ్గించారు. ఏబీపీ - సీఎస్డీఎస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం బీజేపీ 113 - 121 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీ 58 - 64 స్థానాల్లో గెలుపొందుతుందని తేలింది. ఏబీపీ న్యూస్ - లోక్ నీతి - సీఎస్డీఎస్ సంయుక్తంగా గత నెలాఖరులో నిర్వహించిన సర్వేలో బీజేపీ ఓటు శాతం 59 శాతం ఒకేసారి ఆరు శాతం తగ్గి 43 - 47 శాతం వద్ద స్థిర పడింది. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం 12 శాతం పెరిగి 41 శాతానికి చేరుతుంది. కేవలం రెండు నెలల గడువులోనే రెండు పార్టీల మధ్య ఆరు శాతం ఓట్ల తేడా రావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల్లో అత్యధికం ఓబీసీలకు కేటాయించింది. ఇక హార్దిక్ పటేల్ సారథ్యంలోని ‘పాస్'కు 25 స్థానాలు ప్రత్యేకంగా కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అయినా 1990వ దశకం నుంచి అండగా ఉన్న పాటిదార్లు బీజేపీని దెబ్బతీస్తారా? అన్నది సందేహమే.

English summary
In Gujarat, the BJP is facing an unexpected challenge from the Rahul Gandhi-led Congress. The nearly decimated opposition is back in the game after the shift of the formidable young Patidar-OBC-Dalit leaders in Hardik Patel, Alpesh Thakor and Jignesh Mevani to the Congress camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X