వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దెబ్బకు దెబ్బ: అసోం టు మణిపూర్.. బీజేపీ ట్రంప్ కార్డు హిమంత బిశ్వాశర్మ

కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) మలిదఫా అధికారంలోకి వచ్చిన రోజులవి. 2010 మార్చిలో రాజ్యసభలో పార్టీని బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

గువాహటి: కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) మలిదఫా అధికారంలోకి వచ్చిన రోజులవి. 2010 మార్చిలో రాజ్యసభలో పార్టీని బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతున్నది. ఈశాన్య భారతానికి ముఖ ద్వారం వంటి అసోం రాష్ట్రం నుంచి రెండు స్థానాలు గెలుచుకునేందుకు ఎమ్మెల్యేల గణాంకాలు సరిపోలడం లేదు. నాడు కాంగ్రెస్ పార్టీలో అహ్మద్ పటేల్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.

ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నుంచి ఒక అసోం పార్టీ నేతకు ఫోన్ కాల్ వచ్చింది. తదనుగుణంగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నాడు హై డ్రామా చోటు చేసుకున్నది. నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలతో హిమంత్ బిశ్వా శర్మ కారు అసోం అసెంబ్లీ కాంప్లెక్స్ లో ప్రవేశించింది.

2010 రాజ్యసభ ఎన్నికల్లో చక్రం తిప్పిన హిమంత

2010 రాజ్యసభ ఎన్నికల్లో చక్రం తిప్పిన హిమంత

ఫలితంగా 2010 రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నజ్నీన్ ఫరూఖీ, సిల్వియస్ కొండపాన్ 43, 42 ఓట్లతో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఉమ్మడిగా విపక్షం తరుఫున పోటీ చేసిన జయంత్ బారువా కేవలం 40 ఓట్లు మాత్రమే పొందగలిగారు. నాడు రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నాటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. ప్రస్తుతం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ, దాని నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేశారని ఆరోపించారు.

2014లో బీజేపీకి అనుకూలంగా హిమంతా ఇలా

2014లో బీజేపీకి అనుకూలంగా హిమంతా ఇలా

కానీ ఇదే హిమంత బిశ్వాశర్మను బీజేపీ ఈశాన్య భారత రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు అస్త్రంగా వాడుకుంటున్నది. ఈశాన్య భారత రాష్ట్రాల్లోని 24 లోక్ సభ స్థానాల పరిధిలో 19 స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. 2015 ఆగస్టులో హిమంత బిశ్వా శర్మ బీజేపీలో చేరిపోయారు. కానీ అప్పటికే నార్త్ ఈస్ట్ పరిధిలో బీజేపీ సారథ్యంలోని నార్త్ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ కన్వీనర్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. తొలుత అసోం, తర్వాత తాజాగా మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన ఘనత హిమంత బిశ్వా శర్మదే.

మణిపూర్ ప్రభుత్వ ఏర్పాటులో ఇలా..

మణిపూర్ ప్రభుత్వ ఏర్పాటులో ఇలా..

మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరడంలోనూ హిమంత బిశ్వా శర్మ కీలకంగా వ్యవహరించారు. ట్విట్టర్ లో వ్యాఖ్యల ద్వారా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీపై పట్టుకు యత్నించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాల మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలతో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. కానీ బీజేపీ 21 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది. అయితే బేరసారాల్లో, నాయకత్వ ప్రతిభ కనబర్చడంలో నిపుణత ప్రదర్శించిన నేతగా హిమంత బిశ్వాశర్మ వ్యూహాత్మకంగా కాంగ్రెసేతర పార్టీల మద్దతును సాధించగలిగారు. ఆయా పార్టీల నేతలతో స్నేహ సంబంధాలతో బేరసారాలకు తెర తీశారు.

కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడంలో కీలక పాత్ర

కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడంలో కీలక పాత్ర

కాంగ్రెస్ పార్టీలోని 27 మంది ఎమ్మెల్యేల్లోనూ పలువురు హిమంత బిశ్వా శర్మతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీలోకి మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరో తరగతిలోనే అఖిల అస్సాం విద్యార్థి సంఘం (అసు)కు నాయకత్వం వహించిన హిమంతా బిశ్వాశర్మ.. నాటి నుంచి క్రమంగా రాజకీయంగా ఎదిగారు. ఏడో తరగతిలో 1981లో అసులో చీలిక తర్వాత క్రమంగా ప్రతిరోజూ ప్రకటనలతో ప్రజల్లో ఆదరణ పొందారు. ప్రతి ఒక్కరి ఆదరణకు చేరువయ్యారు. 1984లో అసు గువాహటి యూనిట్ ప్రధాన కార్యదర్శిగా గువహటి మెడికల్ కళాశాలలో క్యాంప్ వేశారు. అసుకు, ఉల్పా తీవ్రవాదులకు మధ్య విభేదాలు.. నెల్లీ ఊచకోత తర్వాత గాయాల పాలైన అసు శ్రేణులకు రక్తం అందించడంలో, వైద్య సేవలందించడంలో కీలక పాత్ర పోషించారు.

ఉల్ఫాతో అనుబంధం

ఉల్ఫాతో అనుబంధం

1990లో ఉల్ఫాపై నిషేధం విధించిన తర్వాత దానితో అనుబంధం పెనవేసుకున్న ‘అసు' నాయకుడిగా హిమంతా బిశ్వాశర్మపై అప్పట్లో పోలీసులు టాడా చట్టంలోని సెక్షన్లతో ఒక కేసు, మరో కేసు నమోదు చేశారు. అయితే ఆయనపై చార్జీషీట్ దాఖలు కాలేదు. నిత్యం పోలీసులు, ఆర్మీ గాలింపులు సాగిస్తున్నా, వేటాడుతున్నా.. తన స్నేహితుల సహకారంతోనే బయటపడ్డానంటారు హిమంతా బిశ్వాశర్మ.

హిమంతాను జాతీయ వాదిగా మార్చిన కాంగ్రెస్

హిమంతాను జాతీయ వాదిగా మార్చిన కాంగ్రెస్

అసోంలో ఉల్ఫాతో సంబంధం గల ‘అసు' నేత హిమంతా బిశ్వాశర్మకు జాతీయ వాది హోదా కల్పించిందీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే. నాటి అసోం ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా జరిపిన చర్చలతో హిమంతా బిశ్వాశర్మ రాజకీయ జీవితమే మారిపోయింది. సైకియా స్ఫూర్తితో ‘అసు' నుంచి హిమంతా బిశ్వాశర్మ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సైకియాను తన రాజకీయ గురువు అని హిమంతా బిశ్వాశర్మ సంభోదిస్తారు. హిమంతాలో నాయకత్వ ప్రతిభను గుర్తించిన సైకియా ప్రోత్సహించారు.

1996 నుంచి ఓటమి ఎరుగని హిమంతా

1996 నుంచి ఓటమి ఎరుగని హిమంతా

1993లో కాంగ్రెస్ పార్టీలో చేరిన హిమంతా బిశ్వాశర్మ.. 1996 నుంచి జలుక్‌బరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో తన పలుకుబడి పెంచుకున్నారు. 2006లో నాటి సీఎం తరుణ్ గొగోయ్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తూ వచ్చారు. అంతకుముందు ప్రఫుల్ కుమార్ మహంతా సీఎంగా ఉన్నప్పుడు విపక్ష నేతగా హిమంతా బిశ్వాశర్మ కీలక పాత్ర పోషించారు. 2011 నాటికి తరుణ్ గొగోయ్‌కు వారసుడి అవతారం ఎత్తినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి.

హిమంతా వర్సెస్ కాంగ్రెస్

హిమంతా వర్సెస్ కాంగ్రెస్

తనకంటే హిమంతా బిశ్వాశర్మ ప్రజాదరణ పెరిగిపోతుంటంతో తరుణ్ గొగోయ్ లో అహంకారం పెరిగిపోయింది. సూపర్ సీఎంగా భావిస్తున్న హిమంతా బిశ్వాశర్మకు 55 మంది ఎమ్మెల్యేలు, తరుణ్ గొగోయ్ కు కేవలం 11 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. తర్వాత జరిగిన రాహుల్ గాంధీ నివాసంలో సమావేశంలో పరిస్థితులు మారిపోయాయి. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కుక్కపిల్లకు బిస్కట్లు తినిపిస్తుండటంతో తనకు పరిస్థితి అర్థమైందని హిమంతా బిశ్వాశర్మ తెలిపారు. తనను వెళ్లిపోవాలని రాహుల్‌గాంధీ సంకేతాలిచ్చారని తరుణ్ గొగోయ్‌కు చెప్పి తాను బయటకు వెళ్లిపోయానని బిశ్వా శర్మ అన్నారు.

కాంగ్రెస్ బలహీనతే బీజేపీ బలం

కాంగ్రెస్ బలహీనతే బీజేపీ బలం

గువాహటిలో బీజేపీలో హిమంతా బిశ్వాశర్మ చేరిపోయిన తర్వాత గానీ ప్రజల్లో బలం గల నేత ఎవ్వరో కాంగ్రెస్ పార్టీకి అర్థం కాలేదు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. కాంగ్రెస్ రహిత ఈశాన్య భారతం నినాదం ముందుకు తెచ్చారు హిమంతా బిశ్వాశర్మ. గతేడాది అసోం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హిమంతా బిశ్వాశర్మ లేకుండా బీజేపీ విజయం అసాధ్యమని అందరికీ తెలిసిన విషయమే. బీజేపీలో విలువలు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్తారు. 20 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో సేవలందించిన తర్వాత బీజేపీలో చేరిన తనకు మార్పులు చేసే అవకాశం లభించిందన్నారు. హిమంతా బిశ్వాశర్మను వదులుకున్న కాంగ్రెస్ పార్టీ యావత్తు ఈశాన్య భారతమే తమ పట్టులో నుంచి తొలగిపోతుందని ఏనాడూ ఊహించలేదు.

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ తరహా ప్రచారం

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ తరహా ప్రచారం

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో మాదిరిగా లెఫ్ట్ ఫ్రంట్ తరహాలో ప్రచారం చేసి విజయం సాధించగలిగామని హిమంతా బిశ్వాశర్మ చెప్పారు. బెంగాల్ ముస్లిం నేత ఒకరు మాట్లాడుతూ 20 ఏళ్లుగా హిమంతా బిశ్వాశర్మ గురింి తనకు తెలుసునని, ఆయన మతతత్వ వాది అంటే తాము నమ్మలేమని పేర్కొన్నారు. ప్రస్తుతం అసోం సీఎంగా సర్బానందా సోనోవాల్ ఉన్నా హిమంతా బిశ్వాశర్మ మరో అధికార కేంద్రంగా ఉన్నారంటే అతిశేయోక్తి కాదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో 24 స్థానాలకు 19 చోట్ల విజయం సాధిస్తే బిశ్వాశర్మ నాయకత్వానికి తిరుగుండదని విశ్లేషకులు తెలిపారు. బీజేపీలో చేరడానికి ముందు ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చినా.. అవన్నీ కుట్ర పూరితమని హిమంతా బిశ్వాశర్మ వివరించారు.

English summary
Himanta Biswa Sarma: BJP's Machiavelli for the North East
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X