ప్రిన్సిపాల్ ను వెంటాడి బట్టలు చింపేసి కొట్టిన హిందూ సంఘాలు !

పూణే/ముంబాయి: ప్రముఖ స్కూల్ లో విద్యార్థులతో క్రైస్తవ ప్రార్థనలు పాడమని స్కూల్ యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని ఆరోపిస్తూ హిందూ సంఘ సంస్థలు, కొందరు విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ మీద దాడి చేశారు. ఇదే స్కూల్ లో పని చేస్తున్న ప్రిన్సిపాల్ ను వెంటాడి వెంటాడి బట్టలు చింపి దాడి చెయ్యడం కలకలం రేపింది.

మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని తలేగాన్ లోని దభాడే పట్టణంలో డీవై పాటిల్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ లో చదువుతన్న అమ్మాయిలు, అబ్బాయిలతో స్కూల్ యాజమాన్యం క్రైస్తవ మత ప్రార్థనలు పాడాలని ఒత్తిడి చేస్తున్నారని అదే స్కూల్ లో చదువుతున్న కొందరు విద్యార్థుల కుటుంబ సభ్యులు, హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Hindu groups

హిందుత్వ సంఘాలు, విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ లోకి వెళ్లారు. ఆవేశంతో స్కూల్ లోకి వెళ్లిన హిందూ సంఘ, సంస్థలు స్కూల్ ప్రిన్సిపాల్ అలెగ్జాండర్ కోట్స్ రీడ్ అలియాస్ అలెగ్జాండర్ ను పట్టుకుని చితకబాదేశారు. దెబ్బలు తట్టుకోలేక ప్రిన్సిపాల్ అలెగ్జారండర్ అక్కడి నుంచి స్కూల్ మేడ మీదకు పరుగు తీశారు.

స్కూల్ లో ప్రిన్సిపాల్ ను రెండు అంతస్తుల పై వరకు వెంటాడి వెంటాడి బట్టలు చంపేసి హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేసి ఆయన మీద దాడి చేశారు. ఇదే సమయంలో స్కూల్ లోని అమ్మాయిలు, అబ్బాయిల బాత్ రూమ్ ల దగ్గర సీసీటీవీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేశారు అంటూ హిందూ సంఘాలు స్కూల్ యాజమాన్యం మీద మండిపడ్డాయి.

డీవై పాటిల్ స్కూల్ ప్రిన్సిపాల్ అలెగ్జాండర్ మీద దాడి చేస్తున్న సమయంలో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. కొంద మంది విద్యార్థుల తల్లిదండ్రులు, హిందూ సంఘాలు ప్రిన్సిపాల్ అలెగ్జాండర్ ను బట్టలు చింపి దాడి చేశారని స్థానిక ఇన్స్ పెక్టర్ రంజిత్ సావంత్ అన్నారు.

Hindu groups

స్కూల్ లో విద్యార్థులతో బలవంతంగా క్రైస్తవ ప్రార్థనలు చేయిస్తున్నారని విద్యార్థుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని. అయితే ప్రిన్సిపాల్ మీద దాడి జరిగిందని స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చెయ్యలేదని, కేసు విచారణలో ఉందని ఇన్స్ పెక్టర్ రంజిత్ సావంత్ చెప్పారు. స్కూల్ లో ప్రిన్సిపాల్ ను వెంటాడి వెంటాడి దాడి చెయ్యడం మహారాష్ట్రలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+