రజనీకాంత్ తో హిందూ మక్కల్ కచ్చి నేతలు భేటీ: ఏం జరిగిందంటే, మరుసటి రోజే అందరూ!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ను హిందూ మక్కల్ కచ్చి నేతలు కలిశారు. సోమవారం చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని రజనీకాంత్ ఇంటికి హిందూ మక్కల్ కచ్చి నాయకుడు అర్జన్ సంపత్ నేతృత్వంలోని నాయకులు వెళ్లారు.

ఆంధ్రాలో అడుగుపెట్టిన స్టాలిన్: చంద్రబాబు ఇలా, తొడకొట్టి సీంకు సవాల్, దమ్ముంటే!

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మేము స్వాగతిస్తామని గతంలో హిందూ మక్కల్ కచ్చి నాయకులు ప్రకటించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని హిందూ మక్కల్ కచ్చి పార్టీ నేతలు గతంలో చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది.

హిందూ సంఘాల మద్దతు !

హిందూ సంఘాల మద్దతు !

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని తమిళనాడులోని హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామని గతంలోనే హిందూ సంఘ, సంస్థలు ప్రకటించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్ రాజకీయాల్లో రావాలని ఆయన అభిమానులు మనవి చేస్తున్నారు.

రహస్యంగా చర్చలు

రహస్యంగా చర్చలు

సోమవారం రజనీకాంత్ ను కలిసిన హిందూ మక్కల్ కచ్చి నేతలు సూపర్ స్టార్ తో ఏకంతంగా చర్చలు జరిపారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో హిందూ మక్కల్ కచ్చి నేతలు ఆయన్ను కలవడంతో ఇప్పుడు పెద్ద చర్చ మొదలైయ్యింది.

రాజకీయాల్లోకి మీరు వస్తే !

రాజకీయాల్లోకి మీరు వస్తే !

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు పరిస్థితులే మారిపోతాయని హిందూ సంఘ, సంస్థలు అంటున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఎంతో అవసరం ఉందని అంటున్నారు.

నో కామంట్

నో కామంట్

రజనీకాంత్ తో భేటీ అయిన తరువాత హిందూ మక్కల్ కచ్చి నేతలను మీడియా కలుసుకుంది. రజనీకాంత్ తో భేటీ వెనుక ఉన్న ప్రాధాన్యత వివరించండి అంటూ మీడియా ప్రశ్నించగా నో కామెంట్ అంటూ ఆ పార్టీ నేతలు అన్నారు. రజనీకాంత్ ను స్నేహపూర్వకంగా కలిశామని చెప్పారు. రజనీకాంత్ ను రైతు సంఘం నాయకులు కలుసుకున్న మరుసటి రోజే హిందూ మక్కల్ కచ్చి నేతలు సూపర్ స్టార్ ను కలవడంతో తమిళనాడులో ఇప్పుడు పెద్ద చర్చ మొదలైయ్యింది.

వేచి చూస్తున్న రజనీకాంత్ !

వేచి చూస్తున్న రజనీకాంత్ !

అభిమానులతో పాటు అనేక వర్గాలకు చెందిన నాయకులు అందరినీ కలుపుకుని రాజకీయాల్లోకి రావాలని రజనీకాంత్ పక్కా ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది. డిసెంబర్ 12వ తేదీ రజనీకాంత్ పుట్టినరోజు సందర్బంగా సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని ఆయన సన్నిహితులు ఇప్పటికే ప్రకటించారు. అయితే అంతకంటే ముందుగానే రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేస్తారని సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A day after he met farmers, Tamil superstar Rajinikanth is all set to meet members of Hindu Makkal Katchi. The meeting between Rajinikanth and the Hindu outfit has only added fuel to speculations of the actor taking the political plunge.
Please Wait while comments are loading...