హిందూ అన్న మతమే లేదు, అది కేవలం భౌగోళిక గుర్తింపే : జగ్గీ వాసుదేవ్

న్యూఢిల్లీ : ప్రపంచంలో ఎక్కడా హిందూమతం అన్నదే లేదని ప్రకటించి ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ సంచలనానికి తెరలేపారు. ఓ జాతీయ టీవి ఛానెల్ ఇంటర్వ్యూలో భాగంగా హిందూమతం దాని వాస్తవాల గురించి మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూమతం అన్నది ఏ పుస్తకంలోనో రాయబడలేదని, భౌగోళికంగా మాత్రమే హిందూ అన్న పదానికి గుర్తింపు ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

హిందూ అన్నది ఏ నమ్మకాలతోను ముడిపడి లేదని, నమ్మకాలకు అతీతంగా ఈ గడ్డపై జన్మించినవారంతా హిందువులేనని స్పష్టం చేశారు. దేశంలో జరుగుతున్న రోడ్ల పేరు మార్పిడిలపై కూడా స్పందించారు వాసుదేవ్. దేశానికి అక్బర్ చేసిన సేవలను గుర్తించైనా..! ఆయన పేరు మీదున్న రోడ్డుకు వేరే పేరు పెట్టకుండా ఉండాలని సూచించారు.

Hinduism Not A Religion, There's No Book, No Papacy: Sadhguru

అలాగే ఔరంగజేబు గురించి కూడా ప్రస్తావించిన వాసుదేవ్, ఇజ్రాయిల్ కు హిట్లర్ ఎలానో, ఇండియాకు ఔరంగజేబు అలాంటి వాడని, కాబట్టి ఔరంగజేబు పేరు మీదున్న పేర్లన్నింటిని దేశం నుంచి తొలగించేయాలని డిమాండ్ చేశారు. భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో యువతకు ఇస్తున్న ఆయుధ శిక్షణపై స్పందిస్తూ.. దాన్నంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అదేమంత పెద్ద విషయమేమి కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+