పార్లమెంట్ లో కలకలం, నా కొడుకు ఉరి వెయ్యండి, బీఇ చదివి ఏం చేస్తున్నాడంటే ?, గౌడ !

పార్లమెంటులో బుధవారం మద్యాహ్నం భద్రతా లోపం సంభవించడంతో కలకలం రేపింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోపలికి ఇద్దరు చొరబడ్డారు. పసుపు రంగు పొగను వెదజల్లుతున్న పొగ డబ్బాలతో ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుండి ఎంపీల బెంచీల మీదకు దూకి నానా రాద్దాంతం చెయ్యడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.

పార్లమెంటులో ముదురు నీలం రంగు చొక్కా ధరించిన ఓ వ్యక్తి ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఎంపీలు కుర్చునే ప్రాంతంలోకి దూకడం కలకలం రేపింది. రెండో వ్యక్తి ప్రేక్షకుల గ్యాలరీలో రంగుల పొగను చల్లుతూ లోపలికి ప్రవేశించాడు. దీనికి సంబంధించి పార్లమెంట్ హాలులో ఇద్దరు వ్యక్తులను ఎంపీలు, భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 13వ తేదీన ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

His father Devaraj Gowda made sensational comments about Manoranjan, who infiltrated Parliament

లోక్‌సభ లోపల అరెస్టు అయిన ఇద్దరు యువకుల్లో ఒకరిని మైసూర్‌కు చెందిన మనోరంజన్‌గా గుర్తించామని ఢిల్లీ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. మనోరంజన్ తండ్రి కడా టీవీలో పార్లమెంట్ లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఫుటేజీని చూసి అతడిని తన కొడుకుగా గుర్తించారు. ఈ విషయమై మీడియాతో మనోరంజన్ తండ్రి దేవరాజ్ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

His father Devaraj Gowda made sensational comments about Manoranjan, who infiltrated Parliament

మనోరంజన్ తన కొడుకే అని దేవరాజ్ గౌడ అన్నారు. తన కొడుకు మనోరంజన్ బెంగుళూరులో బీఈ చదివాడని, ఢిల్లీ, బెంగుళూరులో అతను తిరుగుతున్నాడని, వాడు ఎక్కడికి వెళ్లాడో మాకు తెలియదని దేవరాజ్ గౌడ అన్నారు. 2014లో బీఈ పూర్తి చేసిన తన కొడుకు మనోరంజన్ ఎక్కడా ఉద్యోగం చెయ్యలేదని దేవరాజ్ గౌడ చెప్పారు. నేను రైతును అని, తన కొడుకు మనోరంజన్ ను కష్టపడి చదివించానని దేవరాజ్ గౌడ చెప్పారు.

తన కొడుకు మనోరంజన్ చాలా బాగా చదివేవాడని, పొలానికి వచ్చి పనిమనుషులతో కలిసి పొలం పని చేసేవాడని, తన కొడుకు ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నాడో చెప్పలేదని దేవరాజ్ గౌడ అన్నారు. నా కొడుకు ఇలా చెయ్యడం క్షమించరాని నేరం అని, పార్లమెంట్ అంటే దేవాలయం అని, తన కొడుకు తప్పు చేశాడు అని నేరం రుజువు అయితే అతన్ని ఉరి తియ్యాలని మనోరంజన్ తండ్రి దేవరాజ్ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

His father Devaraj Gowda made sensational comments about Manoranjan, who infiltrated Parliament

నా కొడుకు మనోరంజన్ ఇలా ఎందుకు చేశాడో నాకు తెలియదు. ఈ కేసులో ఇతరుల గురించి కూడా నాకు ఎలాంటి సమాచారం తెలీదని, వాళ్లు ఎవరో తనకు తెలియదని, తన కొడుకు మాత్రమే తరచూ ఇంటికి వచ్చేవాడని, మూడు రోజుల క్రితం మనోరంజన్ బెంగళూరు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడని, అయితే తన కుమారుడికి ఏ సంస్థతో కానీ, ఏ రాజకీయ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదని దేవరాజ్ గౌడ చెప్పారు.

మనోరంజన్ సమాజానికి మంచి చేయాలని అనుకున్నానని, ఇలా తయారుఅవుతాడని తాను ఊహించలేదని దేవరాజ్ గౌడ విచారం వ్యక్తం చేశారు. మనోరంజన్ బెంగళూరులోని వివేకానంద యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి నిరుద్యోగిగా ఉన్నాడని సమాచారం. మైసూరు చెందిన మనోరంజన్ పార్లమెంట్ లో చొరబడ్డాడని వెలుగు చూడటంతో మైసూరులోని అతని వద్ద పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+