విదేశీ మహిళలను వేధించిన పోలీసులపై వేటు

బెంగళూరు: విదేశీ మహిళలతో అసభ్యంగా ప్రవర్థించిన ఇద్దరు పోలీసులతో పాటు నలుగురు హోంగార్డులను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆరుగురి పైన కేసు నమోదు చేశారు. వివరాలలోకి వెళితే.. కర్ణాటకలోని కోప్పళ జిల్లాలో హొలి పండుగ సందర్బంలో పోలీసులు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

కోప్పళ సమీపంలోని విరూపాపురలో హోలీ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా కోప్పళ జిల్లా ఎస్సీ పి రాజ భద్రతా ఏర్పాట్లు చేశారు. సంబంధిత పోలీసులను వారికి సూచించిన ప్రాంతాలకు వెళ్లమని ఆదేశాలు జారీ చేశారు. విరుపాపురలో గంగావతి పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్స్ అమృత్ రాజేష్, రేవప్పలను భద్రతా ఎర్పాట్లలో నియమించారు.

ఇద్దరు పోలీసులకు తోడుగా నలుగురు హోంగార్డులు ఉన్నారు. ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం హంపిని సందర్శించడానికి వెళ్లిన విదేశీ మహిళలు విరూపాపురలో జరిగిన హోలి వేడుకలు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు విదేశీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

Holi 2015: India Celebrates Festival of Colours......police saspend in gangavathi

హోలీ వేడుకలలో పాల్గొన్న వారు పోలీసులను వారించారు. వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. సదరు విదేశీ మహిళలు గంగావతి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కోప్పళ జిల్లా ఎస్పీ పి రాజ విచారణ చేసి నివేదిక సమర్పించాలని డీఎస్పీ, సీఐలకు ఆదేశాలు జారీ చేశారు.

ఇద్దరు పోలీసులతో పాటు హోంగార్డులు విదేశీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్థించారని వెలుగు చూసింది. నివేదిక పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజ కానిస్టేబుల్స్ అమృత్ రాజేష్, రేవప్ప, నలుగురు హొంగార్డులను సస్పెండ్ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. విదేశీ మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రాజ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+