వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: గృహ, వ్యక్తిగత రుణాలు ఇక చౌక

రెపోరేట్‌ను 25 పాయింట్లు ఆర్‌బిఐ తగ్గించడంతో గృహ నిర్మాణాల కోసం, వ్యక్తిగత రుణాలు ఇక మరింత చౌకగా మారనున్నాయి. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ బుదవారం నాడు ఈ నిర్ణయం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రెపోరేట్‌ను 25 పాయింట్లు ఆర్‌బిఐ తగ్గించడంతో గృహ నిర్మాణాల కోసం, వ్యక్తిగత రుణాలు ఇక మరింత చౌకగా మారనున్నాయి. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ బుదవారం నాడు ఈ నిర్ణయం తీసుకొంది.

రెపోరేటును తగ్గించడంతో గృహ నిర్మాణలకు , వ్యక్తిగత రుణాల కోసం వడ్డీరేట్లు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Home and personal loans now cheaper, RBI cuts repo rates

రెపోరేటు 6.25 శాతం నుండి 6 శాతానికి తగ్గించారు. తగ్గించిన రేటు 0.25 శాతంగా ఉంది. అయితే దీని కారణంగా మార్కెట్‌లో డబ్బు విస్తృతంగా చలామణి అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సెంట్రల్ బ్యాంకుల నుండి వడ్డీ తగ్గింపుల కోసం పూర్తి ప్రయోజనం పొందని బ్యాంకులకు మరిన్ని బ్యాంకులు అందుబాటులో ఉంటాయని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు.

రెపోరేటు తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంతో మార్కెట్‌ పరుగులెత్తింది. రూపాయి మరింత బలపడింది. రెండేళ్ళలో ఎప్పుడూ లేనంతగా బలపడింది.

రెపో రేటును తగ్గించడం వల్ల ఎస్‌బిఐ తన బ్యాంకులోని సుమారు కోటి పొదుపు ఖాతాలపై వడ్డీరేటును 4 శాతం నుండి 3.5 శాతానికి తగ్గించింది. 2016 అక్టోబర్‌లో ఆర్‌బిఐ రెపోరేట్లను తగ్గించింది.

English summary
Home and personal loans will now be cheaper with the Reserve Bank India cutting repo rates by 25 basis points. The RBI's monetary policy committee led by RBI governor Urjit Patel announced the decision on Wednesday. The cut on key rates is expected to bring down interest rates of personal and home loans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X