నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు: పోలీసులకు హనీప్రీత్ మాజీ భర్త ఫిర్యాదు
తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ డేరాబాబా ‘దత్తపుత్రిక’ హనీప్రీత్ సింగ్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం హర్యానాలోని కర్నాల్ పోలీసులకు విశ్వాస్ గుప్తా ఫిర్యాదు చేశార
చండీగఢ్: తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ డేరాబాబా 'దత్తపుత్రిక' హనీప్రీత్ సింగ్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా పోలీసులను ఆశ్రయించారు. డేరా సచ్చా సౌధా అనుబంధ సంస్థ 'ఖుర్బానీ వింగ్' నుంచి తనకు బెదిరింపు లేఖ వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు హర్యానాలోని కర్నాల్ పోలీసులకు విశ్వాస్ గుప్తా ఫిర్యాదు చేశారు. 1991లో హనీప్రీత్‌ను వివాహం చేసుకున్న విశ్వాస్ గుప్తా... గురువారం తన తండ్రిని వెంటబెట్టుకుని కర్నాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

గుర్మీత్ సింగ్‌కు, తన భార్య హనీప్రీత్‌కు మధ్య అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన దగ్గర్నుంచి తనను చంపేస్తామంటూ డేరా గూండాలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. గుర్మీత్ సింగ్ ప్రతిష్టకు భంగం కలిగిస్తే తీవ్ర పరిణమాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తనను హెచ్చరించారన్నారు.
మరోవైపు గుర్మీత్ సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన అందర్నీ చంపేస్తామంటూ డేరా సచ్చా సౌధా అనుబంధ సంస్థ 'ఖుర్బానీ లీగ్' ఇప్పటికే పలు మీడియా సంస్థలు, డేరా మాజీ అనుచరులు, పోలీసులను బెదిరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హర్యానా పోలీసులు ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications