పరువు హత్య: వేరే కులానికి చెందిన వ్యక్తితో పెళ్ళి, కూతురిని చంపాడిలా
వేరే కులానికి చెందిన వాడవిని ప్రేమించి పెళ్ళిచేసుకొందనే అక్కసుతో ఓ తండ్రి తన కూతురుని నరికి చంపాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.
ముంబై: వేరే కులానికి చెందిన వాడవిని ప్రేమించి పెళ్ళిచేసుకొందనే అక్కసుతో ఓ తండ్రి తన కూతురుని నరికి చంపాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.
మహారాష్ట్ర బుల్ఢానా జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. నింఖాడే గ్రామానికి చెందిన బాలు షివారే తన కుమార్తె మనీషా హింగానేకు పెళ్ళి సంబంధం ఖరారు చేశాడు.

ఏప్రిల్ 20వ, తేదిన పెళ్ళి ముహుర్తం కూడ నిర్ణయించారు.అయితే మనీషా అదే గ్రామానికి చెందిన గణేష్ ను ప్రేమించి అతనితో కలిసి పారిపోయింది.
ఈ ఏడాది మార్చి23వ, తేదిన గణేష్ ను పెళ్ళి చేసుకొంది.వారిద్దరూ ఇటీవలే గ్రామానికి వచ్చారు.భర్తతో కలిసి కుటుంబంతో ఆమె నివాసం ఉంటోంది.
బుధవారం నాడు సాయంత్రం కూతురు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళిన బాలు ఆమెను వెంట తెచ్చుకొన్న గొడ్డలితో మెడపై నరికాడు.
కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన గణేష్ రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.నిందితుడు బాలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు.పరాయి కులం వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకనే తాను తన కూతురిని చంపానని ఆయన ఒప్పుకొన్నాడు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications