గగుర్పొడిచేలా!: మహిళ చెవిలో దూరిన సాలీడు.. ఎలా బయటకొచ్చిందంటే(వీడియో)

లక్ష్మిని పరీక్షించిన అక్కడి వైద్యులు.. ఆమె చెవిలో సాలీడు గూడు కట్టినట్లు గుర్తించారు. డాక్టర్ చెవిలో లైట్ వేయగానే.. లోపలున్న సాలెడు పురుగు దానికదే పాక్కుంటూ బయటకు వచ్చేసింది.

బెంగళూరు: ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో చెవులు, ముక్కుల్లోకి.. ఏ పురుగో దూరిపోతే.. ఆ తర్వాత చుక్కలు కనిపించడం ఖాయం. తెల్లారి లేచేసరికి విపరీతమైన తలనొప్పో.. నీరసం ఆవహించడమో.. లేక పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించడమో జరుగుతుంది. ఎందుకిలా అవుతుందో అంతుపట్టక.. డాక్టర్ వద్దకు వెళ్తే గానీ అసలు విషయం బయటపడదు.

తాజాగా బెంగళూరుకు చెందిన 49ఏళ్ల లక్ష్మి అనే మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. నిద్రలో నుంచి లేచిన లక్ష్మికి కుడి చెవిలో ఏదో దూరినట్లు అనిపించింది. చెవిని ఎనన్నిసార్లు శుభ్రం చేసినా ఇదే తంతు. దానికి తోడు అంతకంతకు తలనొప్పి విపరీతమవుతూనే ఉంది. ఇక లాభం లేదనుకున్న లక్ష్మి.. స్థానిక కొలంబియా ఏషియా ఆసుపత్రికి పరిగెత్తింది.

లక్ష్మిని పరీక్షించిన అక్కడి వైద్యులు.. ఆమె చెవిలో సాలీడు గూడు కట్టినట్లు గుర్తించారు. డాక్టర్ చెవిలో లైట్ వేయగానే.. లోపలున్న సాలెడు పురుగు దానికదే పాక్కుంటూ బయటకు వచ్చేసింది. దీంతో లక్ష్మితో పాటు డాక్టర్ కూడా ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అనంతరం డాక్టర్ సంతోష్ మీడియాతో మాట్లాడారు. చెవిలో దూరిన సాలీడు.. తిరిగి ప్రాణాలతో బయటకు రావడం తొలిసారి చూశామని, ఇది అరుదైన ఘటన అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+