ఘోర ప్రమాదం: లోయలో పడిన వాహనం, 19 మంది మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కవర్ధలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తునికాకు సేకరణకు వెళ్లి తిరిగి వస్తున్న గిరిజనుల వాహనం అదుపుతప్పి 20 అడుగుల గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. వాహనంలోని మొత్తం 25 మందిలో 18మంది మహిళలతో పాటు డ్రైవర్ ఉన్నాడు. ఈ ప్రమాద ఘటనలో మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కుక్డూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్పాని గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా, మాద ఘటనపై చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు వెల్లడించారు.
कबीरधाम जिले के कुकदूर थाना क्षेत्र के बाहपानी गांव के पास पिकअप पलटने से 18 ग्रामीणों के निधन एवं 4 के घायल होने का दुःखद समाचार प्राप्त हो रहा है।
— Vishnu Deo Sai (Modi Ka Parivar) (@vishnudsai) May 20, 2024
घायलों के बेहतर इलाज के आवश्यक निर्देश ज़िला प्रशासन को दिए गए है।
ईश्वर से दिवंगत आत्माओं की शांति और उनके परिवार के प्रति…
ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సాయం చేసేందుకు అధికారులను ఆదేశించామని చెప్పారు.












Click it and Unblock the Notifications