అనవసరంగా పుట్టావ్ రా..
సమాజంలో రోజురోజుకూ మహిళలపై దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తున్నాయి. ఆడపిల్ల అయితే చాలు అని మృగాళ్లలా మీదపడిపోతున్నారు. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరోవైపు ఉన్నారు. తమ కామ వాంఛ కారణంతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఆడవారు అర్ధరాత్రే కాదు.. పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా భయపడుతున్నారు. ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
UP Girl, 11, Raped By Married Man Gives Birth, Child Dies Minutes Later https://t.co/aFWP88eQ5V - #bharatjournal #news #bharat #india
— Bharat Journal (@BharatjournalX) September 7, 2025
ఉత్తర్ ప్రదేశ్ లో బరేలీలో దారుణమైన ఘటన జరిగింది. ఓ మానవమృగం చేతిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. చిన్నారిని భయపెడుతూ, బ్లాక్ మెయిల్ చేసి పదేపదే అత్యాచారం చేయడంతో ఆ బాలిక గర్భవతి అయింది. అంతేకాక ఒక శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన ఆ శిశువు 30 నిమిషాలకే కన్నుమూసింది. బాలిక ఏడు నెలల గర్భిణిగా ఉన్న సమయంలోనే ఆ శిశువు జన్మించి అరగంట తర్వాత మరణించిందని పోలీసులు తెలిపారు.
యూపీలోని బరేలీలో రషీద్(31) కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడు నెలల క్రితం బాధిత చిన్నారికి పండు ఇస్తానని మాయమాటలు చెప్పి.. తన ఇంటికి పిలిచాడు. అలా ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆ తరువాత తరచూ చిన్నారిపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. అయితే ఇటీవల బాలిక ఆరోగ్యం క్షీణించింది. అయితే చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

అల్ట్రాసౌండ్ పరీక్షలో చిన్నారి ఏడు నెలల గర్భిణి అని తేలింది. ఆ చిన్నారి అదే రోజు అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రీ మెచ్యూర్ బేబీ కావడంతో పుట్టిన 30 నిమిషాల్లోనే మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రషీద్ పై నవాబ్‌గంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ శ్రీవాస్తవ కేసు నమోదు చేశారు. రషీద్ పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందన్నారు.












Click it and Unblock the Notifications