ఓ వైపు బుల్లెట్ రైలు మాట, మరోవైపు తరుచూ రైలు ప్రమాదాలు
అదివారం నాడు ఇండోర్ - పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం పెను విషాధాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో దాదాపు వంద మంది చనిపోయారు. గతంలోను పలుమార్లు రైలు ప్రమాదాలు జరిగాయి.
న్యూఢిల్లీ: ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ బుల్లెట్ రైళ్ల గురించి మాట్లాడుతుంటే, మరోవైపు భారత్ రైలు మార్గాలు అంత రక్షణాత్మకంగా కనిపించడం లేదు. అదివారం నాడు ఇండోర్ - పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం పెను విషాధాన్ని మిగిల్చింది. గతంలోను పలుమార్లు రైలు ప్రమాదాలు జరిగాయి.
గత మూడేళ్లలోరైలు ప్రమాదాలు...
భువనేశ్వర్ రైలు ప్రమాదం - భువవేశ్వర్ -భద్రక్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటన 30 సెప్టెంబర్ 2016లో కటక్ వద్ద జరిగింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు.
సికిందరాబాద్ - ముంబై దురంతో - 12 సెప్టెంబర్ 2015లో సికింద్రాబాద్ - ముంబై దురంతో రైలుకు చెందిన తొమ్మిది కోచ్‌లకు ప్రమాదం జరిగింది. మార్టూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు.

డెహ్రాడూన్ - వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ - 20 మార్చి 2015న డెహ్రాడూన్ - వారణాసి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 39 మంది మృతి చెందారు. ఈ విషాధ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలిలో చోటు చేసుకుంది.
బెంగళూరు - ఫలక్‌నుమా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ - 13 ఫిబ్రవరి 2015లో బెంగళూరులోని అనేకల్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.
దిబ్రూగర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ - 25 జూన్ 2014లో జరిగిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన బీహార్‌లోని చాప్రా సమీపంలో జరిగింది.
గోరక్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ - 26 మే 2014లో గోరక్‌పురకు వెళ్లే రైలు వెళ్లి గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటన యూపీలోని ఖలీలాబాద్ స్టేషన్ సమీపంలో జరిగింది. 25 మంది దాకా మృత్యువాత పడ్డారు.

దివా - సావంత్‌వాది పాసెంజర్ రైలు - 4 మే 2014లో నాగోథానే, రోష్ స్టేషన్ మధ్య రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇరవై మంది మృతి చెందారు.
యూపీలోను..
రైలు ప్రమాదాలకు ఉత్తర్‌ప్రదేశ్ నిలయంగా మారుతోంది. 2014, మే 26 - యూపీలోని ఖైలిలాబాద్ సమీపంలో గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్.. స్టేషనరీని తరలిస్తున్న గూడ్స్‌రైలును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
అక్టోబర్ 1, 2014 - గోరఖ్‌పూర్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో12 మృతిచెందగా, 45 మంది గాయపడ్డారు.
మార్చి 20, 2015 - రాయ్‌బరేలి సమీపంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. డెహ్రడూన్-వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 39 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
జులై 7, 2011 - కస్‌గంజ్ జిల్లాలో అర్ధరాత్రి సమయంలో రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న బస్సును ఛప్రా-మధుర ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 69 మంది మరణించారు.












Click it and Unblock the Notifications