కాన్పు కోసం ఆసుపత్రికి వెళితే కిడ్నీ కొట్టేశారు
లక్నో: కాన్పు కోసం ఆసుపత్రికి వెళితే తనకు తెలియకుండానే కిడ్నీ కాజేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిశ్చార్జి అయిన తరువాత తన కిడ్నీ మాయం అయ్యిందని తెలిసిందని ఆమె పోలీసులకు చెప్పారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని బారీల్లి నగరంలో నారాయణి (30) అనే మహిళ నివాసం ఉంటున్నారు. గత మార్చి నెలలో నారాయణి కాన్పు కోసం బారీల్లి నగరంలోని రోహిత్ అగ్ని హోత్రి ఆసుపత్రిలో చేరారు.
డిశ్చార్జి అయిన తరువాత అనారోగ్యంగా ఉండటంతో తాను వేరే ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నానని, అప్పుడు కిడ్నీ మాయం అయిన విషయం తెలిసిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి యజమాని డాక్టర్ సుష్మా అగ్ని హోత్రి ఖండించారు. 30 నిమిషాల్లో ఆపరేషన్ చేసి కిడ్నీ తొలగించడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.
నారాయణి ఆపరేషన్ చేయించుకునే ముందు అల్ట్రా సౌండ్ స్కానింగ్ తీసుకోలేదని, కాన్పుకు ముందు ఆమెకు రెండు కిడ్నీలు ఉన్నట్లు ఆధారాలు లేవని అంటున్నారు. ఆసుపత్రి పరువు తియ్యడానికి ప్రత్యర్థులు ఇలా చేయించారని ఆమె ఆరోపించారు. కేసు విచారణలో ఉంది.












Click it and Unblock the Notifications