బీహర్‌లో పంకజ్‌మిశ్రా అనే జర్నలిస్టుపై కాల్పులు
పాట్నా: బెంగుళూరులో ప్రముఖ ఎడిటర్ గౌరీ లంకేష్‌ను కాల్చి చంపిన రెండు రోజులకే బీహర్‌లో పంకజ్ మిశ్రా అనే జర్నలిస్టుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

బిహార్‌లోని అరవల్‌లో పాత్రికేయుడు పంకజ్ మిశ్రాపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులో గాయపడిన మిశ్రా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మిశ్రా ప్రస్తుతం రాష్ట్రీయ సహారా పత్రికలో పనిచేస్తున్నారు.
కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.అయితే నిందితులు ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డారనే విషయం మాత్రం వెలుగులోకి రాలేదు.












Click it and Unblock the Notifications