Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయ్ సేతుపతి కూతురుకు రేప్ బెదిరింపులు.. అరెస్టుకు డిమాండ్ చేసిన చిన్మయి..!

శ్రీలంక లెజండరీ స్పిన్పర్ ముత్తయ్య మురళీధరన్ 800 బయోపిక్ ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఎన్నోవివాదాలు చుట్టుముట్టాయి. తమిళ హీరో విజయ్ సేతుపతి మురళీ రోల్ పోషిస్తున్నారన్న వార్తలు రావడంతో తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రోజుకు రోజుకు ఈ సినిమాపై వస్తున్న వార్తలు ఏకంగా తుఫానునే క్రియేట్ చేశాయి. ఇక వార్తలు అధికం అవడం పలువురు ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తుండటంతో విజయ్ సేతుపతి ఈ సినిమా తాను చేయడం లేదని సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం తెలిపాడు. అయినప్పటికీ విజయ్ సేతుపతి లక్ష్యంగా చేసుకుని చాలామంది తనను తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు.

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 సినిమా చుట్టు వివాదాలు ముడేసుకుపోయాయి. గత కొద్ది రోజులుగా విజయ్ సేతుపతికి పలువురు నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఇక మురళీధరన్ కూడా దీనిపై స్పందించాడు. తాజాగా విజయ్ సేతుపతి కూతురుకు అత్యాచార బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికగా ఈ బెదిరింపులు రావడంతో కేసును సమోటోగా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడులో ముత్తయ్య మురళీధరన్ పేరు వింటేనే అక్కడి ప్రజలు మండిపడతారు. శ్రీలంకలో జరిగిన అంతర్యుద్ధంలో చాలామంది ఈలం తమిళులు చనిపోయారు. ఈ యుద్ధానికి ముత్తయ్య మురళీధరన్ మద్దతు తెలిపాడనే కోపం తమిళుల్లో ఉంది.

Hours after opting out of from Muthiahs biopic, Vijay sethupathi daughter gets rape threats

కట్ చేస్తే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తీయాలని భావించి మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతిని సినిమా యూనిట్ అనుకున్నప్పటి నుంచే వ్యతిరేకత వచ్చింది. అప్పటి నుంచి విజయ్ సేతుపతిని అతని కుటుంబాన్నిటార్గెట్ చేసుకుని పోస్టింగులు పెడుతున్నారు. విజయ్ సేతుపతి కూతురును రేప్ చేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు డీఎంకే ఎంపీ కనిమొళి. ఇక ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా దీనిపై స్పందిస్తూ తమిళంలో ట్వీట్ చేసింది. ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందని ఆమె ప్రశ్నించింది. ఈ వ్యవస్థను మార్చేవారు ఎవరూ లేరా అని ప్రశ్నించింది. బాహాటంగా ఒక అమ్మాయిని రేప్ చేస్తామని చెప్పే నీచులను తల్లిదండ్రులు ఎలా పెంచారని మండిపడింది చిన్మయి. దీనిపై స్పందించకుండా చూసి ఊరుకునేవారంతా సిగ్గుపడాలని ఆమె మరో ట్వీట్ చేశారు.

Recommended Video

    #ShameOnVijaySethupathi: Netizens Slams Vijay Sethupathi | Muralitharan Biopic '800 |Oneindia Telugu


    ఇదిలా ఉంటే సోమవారం రోజున ముత్తయ్య మరళీధరన్ మాట్లాడుతూ తన బయోపిక్ చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తుందని భావించానని అయితే ఇంత వివాదానికి దారితీస్తుందని తాననుకోలేదని అన్నాడు. అంతేకాదు ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ఇప్పుడు వచ్చిన వివాదంతో తన బయోపిక్ తిరిగి గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ముత్తయ్య.... సినిమాను తీయకుండా వదిలేయాలన్న ఆలోచన మాత్రం చేయొద్దంటూ వేడుకున్నాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+