House wife: పిల్లల తల్లిని పెళ్లి చేసుకోవాలని కుర్రాడి స్కెచ్, రివర్స్, చంపేసి శవానికి ముద్దలు పెట్టి !
జైపూర్/ రాజస్థాన్: కొన్ని సంవత్సరాల క్రితం ఇంట్లో చూపించిన వ్యక్తిని మహిళ వివాహం చేసుకుంది. భర్తతో కాపురం చేసిన భార్య ఇద్దరు కొడుకులకు తల్లి అయ్యింది. వివాహిత మహిళ మీద ఓ యువకుడి కన్ను పడింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని ఆ యువకుడు వివాహిత మహిళకు చెప్పాడు. తెలిసీతెలీకుండా ఆ యువకుడు అలా మాట్లాడుతున్నాడని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఉద్యోగరీత్యా ఆమె భర్త బయట రాష్ట్రంలో ఉంటున్నాడు. కొడుకులతో కలిసి ఆమె ఇంట్లో ఉంటున్నది. రాత్రి వివాహిత మహిళ ఇంటికి వెళ్లిన ఆ యువకుడు మళ్లీ పాతపాట పాడాడు. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ? అంటూ ఆమెను ప్రశ్నించాడు.
నాకు ఇప్పటికే వివాహం అయ్యి భర్త బతికే ఉన్నాడని, ఇద్దరు పిల్లలను పెట్టుకుని నిన్ను ఎలా వివాహం చేసుకోవాలి చెప్పు అంటూ ఆమె గట్టిగా ప్రశ్నించింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన యువకుడు కొడవలి తీసుకుని వివాహిత మహిళను దారుణంగా నరికి చంపేశాడు. మహిళ కేకలు వేసిన విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు వెళ్లి చూడగా చనిపోయిన మహిళను గట్టిగా పట్టుకున్న ఆ యువకుడు ఆమెకు ముద్దులు పెడుతున్న విషయం గుర్తించి అందరూ షాక్ అయ్యారు.

వివాహిత మహిళ
రాజస్థాన్ లోని జైపూర్ సమీపంలోని ఆహోర్ ప్రాంతంలో శాంతిదేవి అనే మహిళ నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇంట్లో చూపించిన శాంతి లాల్ అనే వ్యక్తిని శాంతి దేవి వివాహం చేసుకుంది. భర్త శాంతి లాల్ తో చక్కగా కాపురం చేసిన శాంతి దేవి ఇద్దరు కొడుకులకు తల్లి అయ్యింది. శాంతి లాల్, శాంతి దేవి దంపతులు వారి పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు.

పిల్లల తల్లి మీద కుర్రాడి కన్నుపడింది
అహోర్ ప్రాంతంలోనే గణేష్ (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. శాంతి లాల్ కుటుంబానికి, గణేష్ కుటంబానికి ముందు నుంచి పరిచయం ఉంది. శాంతి లాల్ ఇంటికి గణేష వచ్చి వెళ్లేవాడు. శాంతి లాల్ ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలో అతని భార్య శాంతి దేవి మీద గణేష్ కన్నుపడింది. ఇంటికి వచ్చి వెలుతున్న గణేష్ తో శాంతి దేవి మాట్లాడుతోంది.

నన్ను పెళ్లి చేసుకుంటావా ?
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని గణేష్ వివాహిత మహిళ శాంతి దేవికి చెప్పాడు. తెలిసీతెలీకుండా గణేష్ అలా మాట్లాడుతున్నాడని, వీడి గురించి పెద్దగా పట్టించుకోకూడదని శాంతి దేవి ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఉద్యోగరీత్యా శాంతి దేవి భర్త శాంతి లాల్ మహారాష్ట్రలో ఉంటున్నాడు.

వార్నింగ్ ఇచ్చిన మహిళ
కొడుకులతో కలిసి శాంతి దేవి ఆమె ఇంట్లో ఉంటున్నది. రాత్రి శాంతి దేవి ఇంటికి వెళ్లిన గణేష్ మళ్లీ పాతపాట పాడాడు. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ? అంటూ గణేష్ వివాహిత మహిళ శాంతి దేవిని ప్రశ్నించాడు. నాకు ఇప్పటికే వివాహం అయ్యి భర్త బతికే ఉన్నాడని, ఇద్దరు పిల్లలను పెట్టుకుని నిన్ను ఎలా వివాహం చేసుకోవాలి చెప్పు, ఇంకో సారి పెళ్లి పేరు ఎత్తితే మీ ఇంట్లో చెబుతాను జాగ్రత్త అంటూ శాంతి దేవి ఇంటికి వెళ్లిన గణేష్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

ఇంట్లోనే నరికి చంపేశాడు
శాంతి దేవి వార్నింగ్ ఇవ్వడంతో సహనం కోల్పోయిన గణేష్ ఇంట్లో ఉన్న కొడవలి తీసుకుని వివాహిత మహిళను దారుణంగా నరికేశాడు. ఆ సమయంలో శాంతి దేవి గట్టిగా కేకలు వేసిన విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి లోపల లాక్ చేసిన గణేష్ శాంతి దేవి బయటకు వెళ్లకుండా చెయ్యడంతో ఆమె అక్కడే ప్రాణాలు వదిలేసింది.
Recommended Video

చంపేసి శవానికి ముద్దులు పెట్టాడు
పోలీసు వెళ్లి చూడగా చనిపోయిన శాంతి దేవి శవాన్ని గట్టిగా పట్టుకున్న గణేష్ శవానికి ముద్దులు పెడుతున్న విషయం గుర్తించి షాక్ అయ్యారు. గణేష్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కావాలనే అతను శాంతి దేవిని చంపేశాడని స్థానికులు అంటున్నారు. గణేష్ ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications