విపక్షాలపై కేంద్రం బ్రహ్మాస్త్రం రెడీ- ఇండియా కూటమి కకావికలవుతుందా ?

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న కేంద్రం విపక్ష ఇండియా కూటమి నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ నెల 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో జమిలి ఎన్నికల బిల్లుతో పాటు మరో కీలక బిల్లు తీసుకురాబోతోంది. ఈ బిల్లు ద్వారా వచ్చే ఎన్నికల కోసం విపక్షాలే కాదు ఇప్పటివరకూ తాము నిర్దేశించుకున్న అన్ని అజెండాలూ పక్కకు పోతాయని కేంద్రం అంచనా వేసుకుంటోంది.

సెప్టెంబరు 18 నుంచి 22 వరకూ జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టనుంది. రాజ్యాంగాన్ని 108వ సారి సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటాను ప్రతిపాదిస్తోంది. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలు ఈ బిల్లును తెచ్చేందుకు విఫలయత్నం చేశాయి. కానీ ఇప్పుడు పూర్తి మెజారిటీతో ఉన్న ఎన్డీయే ఈ బిల్లును తెచ్చి నెగ్గించుకోవాలని చూస్తోంది.

how centres proposed women quota bill in parliament special session Trumps all other agendas?

గతంలో దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 1996 సెప్టెంబరులో 81వ సవరణ బిల్లుగా మొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కానీ ఈ బిల్లు సభ ఆమోదం పొందడంలో విఫలమైంది. ఆ తర్వాత 1996 డిసెంబరులో లోక్‌సభకు తన నివేదికను సమర్పించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. కానీ లోక్‌సభ రద్దుతో బిల్లు రద్దు అయింది.
ఆ తర్వాత 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 12వ లోక్‌సభలో మహిళా బిల్లును తిరిగి ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి ఎం.తంబిదురై దీనిని ప్రవేశపెట్టాక ఆర్‌జేడీ ఎంపీ ఒకరు సభ వెల్ వద్దకు వెళ్లి బిల్లును లాక్కొని చించేశారు. దీంతో బిల్లు మద్దతు పొందడంలో మరోసారి విఫలమైంది.

1999, 2002, 2003లోనూ బిల్లును తిరిగి ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు దీనికి మద్దతు ఇస్తున్నా మెజారిటీ ఓట్లను తెచ్చుకోవడంలో ఇది విఫలమైంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రభుత్వం ఎందుకు ఆమోదించడం లేదని కాంగ్రెస్‌ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ రెండుసార్లు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వాస్తవానికి, యుపిఎ-2 ప్రభుత్వం గడువు ముగియకముందే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నించింది.

ఇప్పుడు మహిళా బిల్లును మరోసారి పార్లమెంటు ముందుకు తీసుకురావడం ద్వారా దీనిపై విపక్షాల్లో ఉన్న భిన్నాభిప్రాయాల్ని క్యాష్ చేసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు సహా మరికొన్ని పార్టీలు మద్దతిస్తున్న ఈ బిల్లును సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జేడీయూ, ఎన్సీపీ వంటి అనేక ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తే అది విపక్షాల్లో కచ్చితంగా చీలిక తెస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకుంటుందని బీజేపీ అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+