వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వణికిస్తోన్న 'ఓక్కి' తుఫాను: ఆ పేరు వెనుక ఇదీ కథ, కన్యాకుమారికి బిగ్ డ్యామేజ్..

|
Google Oneindia TeluguNews

చెన్నై/తిరువనంతపురం: ఓక్కి తుఫాను తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వణికిస్తోంది. తుఫాను బీభత్సానికి ఈ రెండు రాష్ట్రాల్లో భారీ ఆస్తి నష్టం, ప్రాణం నష్టం సంభవించాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 మంది మృత్యువాత పడ్డారు.

వర్ష బీభత్సానికి తమిళనాడులోని కన్యాకుమారి దారుణంగా దెబ్బతింది. తిరునల్వేలి, తూత్తుకూడి, పుదుకోట్టై, రామనాథపురం, విరుదునగర్‌ జిల్లాలు కూడా తుఫాను ధాటికి విలవిల్లాడిపోయాయి.

వాతావరణ శాఖ హెచ్చరిక:

వాతావరణ శాఖ హెచ్చరిక:

ప్రస్తుతం ఓక్కి తుఫాను లక్షద్వీప్‌లోని మినికాయ్‌కు 80 కి.మి. దూరంలో ఉత్తర ఈశాన్య దిశలో కేంద్రీకృతమై ఉంది. దీనికి తోడు దక్షిణ అండమాన్‌ సముద్రం సమీపంలో కేంద్రీకృతమైన వాయుగుండం కూడా తుఫానుగా బలపడే సూచనలు ఉండటంతో వాతావరణ శాఖ నుంచి హైఅలర్ట్ జారీ అయింది.

కన్యాకుమారికి బిగ్ డ్యామేజ్:

కన్యాకుమారికి బిగ్ డ్యామేజ్:

ఓక్కి తుఫాను ధాటికి కన్యాకుమారి జిల్లా తీవ్రంగా నష్టపోయింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గాఢాంధకారం అలుముకుంది. చాలా ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. సుమారు 3,500 విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సేవల పునురుద్దరణకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

కన్యాకుమారిలోని చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కన్యాకుమారీ -నాగర్‌కోవిల్, నాగర్‌కోవిల్‌-తిరునెల్వేలి జాతీయరహదారుల్లో వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. నాగర్‌కోవిల్‌ నుంచి కన్యాకుమారి, తిరువనంతరపురం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

తమిళనాడులో భారీ వర్షాలు, 9 మంది మృతి, ఓఖి తుపాను దెబ్బకు హై అలర్ట్, కేరళలో !తమిళనాడులో భారీ వర్షాలు, 9 మంది మృతి, ఓఖి తుపాను దెబ్బకు హై అలర్ట్, కేరళలో !

తమిళనాడులో 9మంది, కేరళలో 7:

తమిళనాడులో 9మంది, కేరళలో 7:

సెంగోట్టై సమీపంలో ఒక ప్రభుత్వ బస్సు వరద ప్రవాహంలో చిక్కుకుపోయింది. ఎమర్జెన్సీ విండో ద్వారా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తుఫాను ధాటికి తమిళనాడులో 9 మంది మృత్యువాత పడగా.. మృతుల కుటుంబాలకు సీఎం రూ.4లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కేరళలో తుఫాను మృతుల సంఖ్య ఏడుకు చేరడం గమనార్హం.

అసలేంటి ఓక్కి:

అసలేంటి ఓక్కి:


తాజా తుఫానుకు 'ఓక్కి' అని పేరు పెట్టడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలేంటీ ఓక్కి అని ఆరా తీస్తున్నారు. అయితే ఓక్కి అనేది ఓ బెంగాలీ పదం అని తెలుస్తోంది. దీని అర్థం 'కన్ను'. తుఫాను పేరును ఖరారు చేసే అవకాశం ఈసారి బంగ్లాదేశ్ కు రావడంతో ఈ పేరు పెట్టినట్లు సమాచారం.

పసిఫిక్ ఆర్థిక, సాంఘిక సంఘం(ఇస్కాప్) కలిసి 2000వ సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలోని తుఫాన్లకు పేర్టలు పెట్టడం ప్రారంభించాయి. సాధారణంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో సెప్టెంబర్ చివరి నుంచి డిసెంబర్ మధ్య తుఫాన్లు వస్తుంటాయి. ఈ దఫా తుఫాను పేరును ఖరారు చేసే అవకాశం బంగ్లాదేశ్ కు రావడంతోనే ఓక్కి పేరు ఖరారైంది.

English summary
The World Meteorological Organisation (WMO) and the United Nations Economic and Social Commission for Asia and the Pacific (ESCAP) started the tropical cyclone naming system in 2000. .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X