వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీక్రెట్: భారత్ నుంచి బంగ్లాకు బాంబుల సరఫరా ఇలా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బుర్ద్వాన్ పేలుళ్లు ఘటనకు సంబంధించి దర్యాప్తు సంస్ధలు అనేక మంది అనుమానితులను ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌కు చెందిన జమాత్-ఉల్-ముజాహిదీన్ తీవ్ర వాద సంస్ద సభ్యుడైన షేక్ యూసఫ్‌ని ప్రశ్నించగా 2013, 2014 సంవత్సరంలో బాంబులు తయారు చేసి నాలుగు వస్తువులను ద్వారా తరలించారని తేలింది.

ఈ విచారణలో గత రెండు సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లోనే బాంబులను తయారు చేసి బోర్డర్ ద్వారా ఐదు ప్రత్యేక వస్తువుల్లో బంగ్లాదేశ్‌కు తరలించారని ఆఫీసర్లు పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారులు వెల్లడించిన సమచారం ప్రకారం రవాణా సరుకు మాదిరి ఒక్కో వస్తువులో సుమారు 60 బాంబులు వరకు తరలించారు. ఈ బాంబులను బంగ్లాదేశ్‌కు తరలించేందుకు గాను కౌషర్, షేక్ యూసఫ్ ముఖ్య భూమికను పోషించారని తెలిపారు.

ఈ నాలుగు వస్తువులను సరిహద్దు ద్వారా తరిలించినందుకు గాను అక్కడున్న స్థానిక సంస్థల నేతలతో పాటు బోర్డర్ గార్డులకు కూడా లంచాలు ఇచ్చారని విచారణలో తేలిందని పేర్కొన్నారు. వివిధ వస్తువుల్లో ఈ బాంబులను బంగ్లాదేశ్‌కు తరలించి రానున్న సంవత్సరంలో వరుస పేలుళ్లు జరిగేలా చూడటం వీరి పని. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌కు సుమారు 300 బాంబులతో పాటు హ్యాండ్‌ గ్రెనేడ్లను తరలించారు.

 How did terrorists supply bombs from India to Bangladesh

గత నాలుగు సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో ఈ రకమైన కార్యకలాపాలను బంగ్లాదేశ్‌కు చెందిన జమాత్-ఉల్-ముజాహిదీన్ తీవ్ర వాద సంస్ధ నిర్వహించిందని ఈ కేసును దర్యాపు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. ఇక్కడ బాంబులను తయారు చేసి బంగ్లాదేశ్‌కు తరలించడమే వీరి ముఖ్య ఉద్దేశ్యం.

అంతా సిద్ధం చేసుకుని చివరి దశలో బాంబులను బంగ్లాదేశ్‌లో ప్రయోగించేందుకు రెడీగా ఉన్నారు. ఐతే మూడు వారాల క్రిందట అనుకోకుండా బుర్ద్వాన్ జరిగిన మిస్ ఫైరింగ్‌తో అది విజయవంతం కాలేదని అన్నారు. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్ధ ముఖ్య ప్రణాళిక ఒకదాని తర్వాత మరోకదాన్ని నాశనం చేయడమేనని అన్నారు.

బుర్ద్వాన్ పేలుళ్లు ఘటనకు బాధులైన వారితో పాటు జమాత్-ఉల్-ముజాహిదీన్ తీవ్ర వాద సంస్ధతో సంబంధాలున్న స్ధానిక నేతలను ఎవ్వరినీ వదలబోమని చెప్పారు. ఇలాంటి వాటని శాశ్వతంగా తొలగిపోయేలా చూడడంతో పాటు.. మళ్లీ వారు తిరిగి రాకుండా చూడటమే ముఖ్య లక్ష్యమని చెప్పుకొచ్చారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు చెప్పిన దాని ప్రకారం బుర్ద్వాన్‌లో బాంబులు తయారు చేసేందుకు గాను ఎక్కువ మొత్తంలో సమయం, డబ్బును ఖర్చు చేశారు కాబట్టి జమాత్-ఉల్-ముజాహిదీన్ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు.

సోమవారం బుర్ద్వాన్‌ను సందర్శించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలని అన్నారు. ఇండియాను నుంచి జమాత్-ఉల్-ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద సంస్ధలను పూర్తిగా తరిమి కొట్టేందుకు లోకల్ ఇంటెలిజెన్స్ అధికారులు సహాయ సహాకారాలు అవసరమని అన్నారు.

English summary
As the investigating agencies continue their questioning of several suspects in the Burdhwan blast including Shaikh Yusuf, it has found that in the Jamaat-ul-Mujahideen, Bangladesh (JMB) had moved four consignments of bombs to Bangladesh in the years 2013 and 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X