వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తరుముకొస్తున్న మరో కోవిడ్ వేవ్-హెర్డ్ ఇమ్యూనిటీ నుంచి మనం ఇంకెంత దూరం ?

|
Google Oneindia TeluguNews

భారత్ లో మరో కోవిడ్ వేవ్ తరుముకొస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో మళ్లీ జనం మాస్కులు పెట్టుకోవాల్సిందేనని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మరోవైపు వ్యాక్సిన్లు వేయించుకున్న వారంతా తమకు ఇమ్యూనిటీ రాలేదా అనే అనుమానాల్లో మునిగితేలుతున్నారు. చివరిగా హెర్డ్ ఇమ్యూనిటీపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ ఊపందుకుంటోంది.

 భారత్ లో మరో కోవిడ్ వేవ్

భారత్ లో మరో కోవిడ్ వేవ్

భారత్ లో మరో కోవిడ్ వేవ్ ముంచుకొస్తోంది. ఇప్పటికే ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కొత్త కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతోపాటే ప్రభుత్వాల ఆంక్షలు కూడా పెరుగుతున్నాయి. ముందుగా మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేస్తూ యూపీ ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఇదే కోవలో ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆంక్షల్ని తిరిగి కఠినతరం చేస్తోంది. తప్పనిసరైతే స్కూళ్లు కూడా తిరిగి మూసేస్తామని చెబుతోంది. దీంతో జనంలో ఆందోళన కూడా పెరుగుతోంది. మరో కోవిడ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు, ప్రజలు సంసిద్ధులవుతున్నారు.

 వ్యాక్సిన్ వేయించుకున్నా

వ్యాక్సిన్ వేయించుకున్నా

దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కేసుల్ని గమనిస్తే ఇవన్నీ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలోనే అత్యధికంగా కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోని వారిలో ఎలాగో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే గతంలో వేయిచుకున్న రెండు డోసుల వ్యాక్సిన్లు, బూస్టర్ డోస్ ఎటుపోయాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న ఎక్స్ ఈ వేరియంట్ ను తట్టుకోవాలంటే మరో కొత్త వ్యాక్సిన్, అదనపు డోస్ లు తప్పనిసరా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో వ్యాక్సిన్లు వేయించుకున్నవారిలో ఎక్కువగా ఆందోళన కనిపిస్తోంది.

 హెర్డ్ ఇమ్యూనిటీపై చర్చ

హెర్డ్ ఇమ్యూనిటీపై చర్చ

దేశవ్యాప్తంగా తాజాగా నమోదవుతున్న కోవిడ్ కేసులతో హెర్డ్ ఇమ్యూనిటీపై చర్చ మరోసారి మొదలైంది. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే వ్యాక్సిన్లతో సంబంధం లేకుండానే మన శరీరం రోగనిరోధకంగా మారే స్ధితి అన్నమాట. మనం ఈ హెర్డ్ ఇమ్యూనిటీని సాధిస్తే కోవిడ్ వైరస్ వ్యాప్తి ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఈ హెర్డ్ ఇమ్యూనిటీపై చర్చ ఎక్కువగాసాగింది. ఎందుకంటే అప్పట్లో హెర్డ్ ఇమ్యూనిటీ ఉన్నవారికి కోవిడ్ వచ్చిపోయింది కూడా తెలియలేదు. దీంతో ఇప్పుడు దేశమంతా హెర్డ్ ఇమ్యూనిటీ ఎప్పుడు సాధిస్తుందనే చర్చ సాగుతోంది.

 హెర్డ్ ఇమ్యూనిటీకి ఇంకెత దూరం ?

హెర్డ్ ఇమ్యూనిటీకి ఇంకెత దూరం ?

శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణులు కూడా హెర్డ్ ఇమ్యూనిటీపై ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే చేయగలుగుతున్నారు. వారి అంచనాృల ప్రకారం సార్స్ - కోవీ 2 వైరస్, మానవులలో రెండేళ్ల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. పెద్దవారిలో దాదాపు 100 శాతం వ్యాక్సినేషన్‌తో, కోవిడ్-19 కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి వ్యతిరేకంగా భారతదేశం హెర్డ్ ఇమ్యూనిటీని అభివృద్ధి చేసుకుందని అంచనా వేశారు. అయితే వ్యాధి లేదా సార్స్ కోవీ 2 వైరస్ కు వ్యతిరేకంగా మాత్రం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ కు పోటీగా జనంలో ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందితే తప్ప కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గినట్లు కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

English summary
after latest reports on covid 19 cases spike in india, the question on herd immunity arised once again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X