
నాటుసారా ఎలా తయారు చేస్తారు, అది తాగితే మనుషులు ఎందుకు చనిపోతారు?

కల్తీ మద్యం తాగి పెద్ద ఎత్తున ప్రజలు మరణిస్తున్నట్లు తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. ఇటీవలి సంవత్సరాలలో పంజాబ్, అస్సాం, పశ్చిమబెంగాల్, బిహార్‌లలో చాలామంది కల్తీ మద్యం కారణంగా మృత్యువు పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డి గూడెంలో కొన్ని నెలల కిందట సంభవించిన మరణాలు కూడా కల్తీ సారా వల్లేనని ఆరోపణలు వచ్చాయి.
తాజాగా గుజరాత్‌లో కల్తీ మద్యం తాగినా వారిలో మంగళవారం మధ్యాహ్నానికి 26 మంది చనిపోయారని, ఇంకా అనేకమంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని ఆ రాష్ట్ర అధికారులు చెప్పారు.
ఈ ఘటన తర్వాత అసలు కల్తీ మద్యం లేదా నాటు సారాను ఎలా తయారు చేస్తారు, దాని వల్ల కలిగే ప్రమాదాలేంటి అన్నది తెలుసుకుందాం.
నాటు సారా తయారీ, అమ్మకాలు, సేవించడం కొత్తకాదు. అలాగే, ఈ నాటు సారా విషపూరితంగా మారి, దాన్ని తాగిన వారు మరణించడం కూడా కొత్తకాదు. అయినా, నాటుసారా తయారవుతూనే ఉంది, ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
నాటుసారా అని పిలిచే ఈ మద్యాన్ని మరింత మత్తు కలిగించే పదార్ధంగా మార్చే ప్రక్రియలో అది విషపూరితం అవుతూ ఉంటుంది. నాటుసారాను బెల్లం, మొలాసిస్ తో తయారు చేస్తారు. దానికి యూరియా, మరికొన్ని మత్తు కలిగించే పదార్ధాలను చేరుస్తారు.
- జంగారెడ్డిగూడెంలో 18 మంది మృతి: ఇవి నాటుసారా కల్తీ మరణాలా? సహజ మరణాలా?
- జీహెచ్ఎంసీ ఎన్నికలతో హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయా?

మిథైల్ ఆల్కహాల్
ఆల్కహాల్‌ను మరింత మత్తు కలిగించే పదార్ధంగా మార్చడానికి, దానికి ఆక్సిటోసిన్ కలుపుతారు. ఇదే మరణానికి ప్రధాన కారణమవుతుంది.
ఇటీవలి సంవత్సరాలలో, ఆక్సిటోసిన్ కారణంగా నపుంసకత్వం కలగడం, నాడీ వ్యవస్థకు సంబంధించిన అనేక తీవ్రమైన వ్యాధులు కలుగుతున్నాయన్న వార్తలు బయటకు వచ్చాయి.
మిథైల్ ఆల్కహాల్‌ను తీసుకోవడం వల్ల కళ్ల మంటలు, పొట్టలో నొప్పి, మంట ఏర్పడి దీర్ఘకాలంలో కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
ముడి ఆల్కహాల్‌లో యూరియా, ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు కలపడం వల్ల మిథైల్ ఆల్కహాల్ ఏర్పడి, దాన్ని సేవించిన వారు చనిపోయే ప్రమాదం ఉంది.
నిపుణులు చెప్పినదాని ప్రకారం, మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రసాయన చర్య(కెమికల్ రియాక్షన్) మొదలవుతుంది.
చివరకు శరీరంలోని అంతర్గత అవయవాలు పని చేయడం మానేస్తాయి. మనిషి చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
కొన్నిసార్లు నాటుసారా ఉత్పత్తి చేసే సమయంలో టాక్సిక్ ఆల్కహాల్‌తోపాటు కొన్ని జంతు ఉత్పత్తులను కలుపుతారు. ఫెర్మెంటేషన్ (కిణ్వ ప్రక్రియ)ను వేగవంతం చేయడానికి ఇలా చేస్తుంటారు. ఇలాంటివి సేవించినప్పుడు కూడా మనిషి శరీరం విషపూరితం కావడం, ఇన్ఫెక్షన్ సోకడంలాంటి ప్రమాదాలు ఉంటాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- లాక్డౌన్ ఎఫెక్ట్: ఇంట్లో తాగలేక, బయటకు వెళ్లలేక మద్యం మానేసేవాళ్లు పెరుగుతున్నారా?

అందరూ ఎందుకు మరణించరు?
కొంతమంది శరీరంలో ఈ కెమికల్ రియాక్షన్ నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి, వారికి ప్రమాదం తప్పుతుంది.
నాటుసారాగా చెప్పే రసాయన పదార్ధంలో 95 శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీన్ని ఇథనాల్ అని కూడా అంటారు.
చెరుకు రసం, గ్లూకోజ్, బంగాళాదుంపలు, బియ్యం, బార్లీ, మొక్కజొన్న లాంటి పిండి పదార్ధాలను పులియబెట్టడం ద్వారా నాటుసారాను తయారు చేస్తారు.
ఈ ఇథనాల్‌ను మరింత మత్తును కలిగించే రసాయనంగా చేసేందుకు, వ్యాపారులు అందులో మిథనాల్‌ను కలుపుతున్నారు.
'వుడ్ ఆల్కహాల్', 'వుడ్ నాఫ్తా' అని పిలిచే ఈ మిథనాల్ కలపడం వల్ల రసాయన సమతుల్యత తప్పి, అది విషపూరితం అవుతుంది.
- మద్యం దుకాణాల ముందు భారీ క్యూల వెనుక చీకటి నిజం ఏమిటి?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
మిథనాల్ విషపూరితమా?
రసాయనాలలో మిథనాల్ అత్యంత సాధారణ ఆల్కహాల్. ఇది సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది.
దీనిని యాంటీఫ్రీజ్ (పదార్ధాలు గడ్డకట్టే లక్షణాలను తగ్గించడానికి ఉపయోగించే ప్రక్రియ) గానూ, ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.
ఇథనాల్‌ను పోలిన వాసన, రంగు, రుచి లేని, మండే స్వభావం గలిగిన రసాయనమే మిథనాల్
అయితే, మిథనాల్ అనేది ఒక విషపూరితమైన పదార్ధం. దీన్ని తాగడానికి ఉపయోగించకూడదు. తాగడం వల్ల మరణం, కంటి చూపు కోల్పోవడంలాంటి ప్రమాదాలు జరుగుతాయి.
ఇథనాల్‌ను అనేక పరిశ్రమలలో వాడతారు. వార్నిష్‌లు, పాలిష్‌లు, ఫార్మాస్యూటికల్ సొల్యూషన్స్, ఈథర్‌లు, క్లోరోఫామ్, కృత్రిమ రంగులు, పారదర్శక సబ్బులు, పెర్ఫ్యూమ్‌లు, పండ్ల సువాసనలు, ఇతర రసాయన సమ్మేళనాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు.
అనేక రకాల ఆల్కహాల్‌లలో కూడా ఇథనాల్ వాడతారు. గాయాలను శుభ్రం చేసే బ్యాక్టీరియా కిల్లర్‌గా, లేబరేటరీలలో సాల్వెంట్‌గా వాడుతుంటారు.

టాక్సిక్ ఆల్కహాల్ తాగిన తర్వాత శరీరం ఎలా స్పందిస్తుంది?
''సాధారణ ఆల్కహాల్‌ను ఇథైల్ ఆల్కహాల్ అని, అదే టాక్సిక్ ఆల్కహాల్‌ను మిథైల్ ఆల్కహాల్ అని పిలుస్తారు. ఏదైనా ఆల్కహాల్ శరీరంలోకి చేరాక, కాలేయం ద్వారా ఆల్డిహైడ్‌గా మారుతుంది. కానీ, మిథైల్ ఆల్కహాల్ ఫార్మాల్డిహైడ్ అనే విషంగా మారుతుంది. ఈ విషం కళ్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అంధత్వం అనేది మొదటి లక్షణం. ఎవరైనా ఆల్కహాల్ ఎక్కువగా తాగితే, ఫార్మిక్ యాసిడ్ అనే విష పదార్థం శరీరంలో ఏర్పడటం ప్రారంభమవుతుంది.ఇది మెదడు పని చేసే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది'' అని డాక్టర్ అజిత్ శ్రీవాస్తవ వివరించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ టాక్సిక్ ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించడానికి ఆల్కహాల్‌తోనే చికిత్స చేస్తారు. "మిథైల్ ఆల్కహాల్ పాయిజనింగ్ చికిత్సకు ఇథైల్ ఆల్కహాల్ వాడతారు. పాయిజన్ ఆల్కహాల్‌కు విరుగుడుగా టాబ్లెట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇండియాలో వీటి లభ్యత తక్కువగా ఉంది" అని డాక్టర్ శ్రీవాస్తవ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
- పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జెండా వివాదం: ఫేస్‌బుక్ నుంచి జెండా ఫొటోను పాక్ ఎందుకు తొలగించింది?
- నీరజ్ చోప్రా: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు
- అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ. 21 కోట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ. ఈమె ఎవరు? మమత ప్రభుత్వంలోని మంత్రికీ ఆమెకూ లింకేంటి?
- పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా స్టార్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)