మైనస్ 70 డిగ్రీలో చలిలో వంట, వార్పు : సియాచిన్‌లో సైనికుల పాట్లు,
న్యూఢిల్లీ : మనం ఎండను తట్టుకోలేం. వర్షమొచ్చినా అదే పరిస్థితి. ఇక చలి సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సాధారణ చలికే మనం గజగజ వణికిపోతాం. అదే సియాచిన్ హిమానీనదం అయితే .. ఇక పరిస్థితి చెప్పక్కర్లేదు. కశ్మీర్‌లా మైనస్ డిగ్రీలు కాదు .. ఏకంగా 40 నుంచి 70 మైనస్ డిగ్రీల చలిలో కూడా మన సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతకీ మన సైనికులు ఏమేం ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుందాం. పదండి.

మంచుదుప్పటి ..
సియాచిన్ హిమానీనదం. మంచుపర్వతంలో మంచుదుప్పటి కప్పుకొని ఉంటుంది. సముద్రానికి ఎత్తైన పర్వతం .. అందులో మంచ కప్పబడి ఉంటుంది. ఈ ప్రాంతంపై కూడా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతుంటారు. దీంతో భారత సైన్యం కంటికి రెప్పాలా ఈ ప్రాంతాన్ని కాపాడుతుంది. కానీ ఇక్కడ అసాధారణంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. సాధారణంగానే మైనస్ డిగ్రీలు .. అవీ శీతకాలం నాటికి మైనస్ 40 నుంచి 70 డిగ్రీలకు చేరుకుంటుంది. అంటే సాధారణ దుస్తులు వేసుకుంటే మనిషి గడ్డకట్టే పరిస్థితి. మన సైనికులు శత్రువులతోనే కాదు .. తమతో తాము కూడా యుద్ధం చేస్తున్నారు.

మమూలు చలి కాదు ...
అంతటి శీతల పరిస్థితుల్లో విధుల నిర్వహణ అంటే మాటలు కాదు. ఆ ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రతి సెకను కూడా అప్రత్తంగా ఉండాల్సిన పరిస్థితి. దీనికితోడు చలిగాలులు వీయడంతో .. ఆహారం తవండుకునే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సియాచిన్‌లో తాము ఎలాంటి పరిస్థితులో ఉన్నామనే తెలిపే వీడియో ఒకటి బయటకొచ్చింంది. ఇంకేముంది ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అత్యంత చలిలో అక్కడున్న సైనికులు వంట వండేందుకు పాట్లు పడుతున్న పరిస్థితి వీడియోలో స్పష్టంగా కనిపించింది. ముగ్గురు సైనికులు కత్తి పట్టుకొని .. పొట్ట కూటి కోసం పాడుతున్న పాట్లు హృదయవిదారకంగా ఉంది.

సైనికుల పాట్లు ...
అక్కడున్న ఓ ఫ్రూట్ జ్యూస్‌ను తెరిచేందుకు కూడా కష్టమైంది. తమ వద్ద ఉన్న సుత్తితో కష్టపడి మరీ తెరిచారు. అంతేకాదు ఆ జ్యూస్ అంతటిని ఓ పాత్రలో పెట్టి వేడి చేశాక .. సేవించారు. లేదంటే గడ్డకట్టి జ్యూస్ వచ్చేది కాదు. అంతేకాదు తమ వద్ద ఉన్న కోడిగుడ్డు ఎలా గడ్డకట్టిందో కూడా చూపించారు. ఇది సియాచిన్ ఎగ్ అని వీడియోలో చూపించారు. కోడిగుడ్డును కూడా ఉడకబెట్టాక .. కత్తిరించేందుకు ఇబ్బందిపడ్డారు. అంతేకాదు ఆలుగడ్డ, టమాట, కూరగాయాలను వేడినీళ్లలో కాసేపు ఉడకబెట్టాకే వండుకుంటామని స్పష్టంచేశారు. ఈ వీడియో బయటకొచ్చాక .. చాలామంది ప్రజలు జవాన్లు సెల్యూట్ చేశారు. సరిహద్దుల్లో కాపాలా కాస్తున్నా వీరులారా అని కీర్తిస్తున్నారు.
-
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications