Manmohan Singh: సంస్కరణల మేటి మన్మోహన్-బంగారం తాకట్టు నుంచి ఆర్ధిక వృద్ధి దాకా..!

భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్ధిక వేత్త మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. భారత ఆర్దిక రంగంపై దాదాపు రెండు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ మరణంతో దేశ ఆర్ధిక వ్యవస్థ తనకు ఒకప్పుడు ప్రాణం పోసిన పితామహుడిని కోల్పోయింది. ఒకప్పుడు రహస్యంగా బంగారం తాకట్టు పెట్టే పరిస్ధితుల్లో ఉన్న మన దేశాన్ని తన ఆర్దిక సంస్కరణలతో వృద్ధి నమోదు చేసే వరకూ నడిపించిన అపర మేథావి మన్మోహన్ మరణంతో దేశం పెద్ద దిక్కును కోల్పోయింది.

భారత్ ఖజానా ఖాళీ

90వ దశకం ప్రారంభంలో భారత ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది. కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఖజానా ఖాళీ అయిపోయింది. దేశంలో విదేశీ మారక నిల్వలు ఎన్నడూ లేనంత దారుణంగా 1200 కోట్ల డాలర్లకు పడిపోయాయి. కేవలం మూడు వారాలు మాత్రమే మనం దిగుమతులు చేసుకునే దుస్దితికి వచ్చేశాం. కేంద్రం ఎవరికీ చెల్లింపులు చేసే పరిస్ధితి లేక దాదాపు దివాళా తీసింది. అప్పటి చంద్రశేఖర్ ప్రభుత్వం అతి కష్టం మీద 67 టన్నుల బంగారం తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంక్ నుంచి అత్యవసర రుణం తీసుకుంది.

how manmohan singh s reforms transform india from secretly pledging gold to economic growth

రహస్యంగా విదేశాలకు బంగారం తరలింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరికీ తెలియకుండా రహస్యంగా విమానంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు 47 టన్నుల బంగారాన్ని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్లర్లాండ్ కు 20 టన్నుల బంగారాన్ని తాకట్టుకు తరలించింది. దీంతో 600 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. 1991 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో రహస్యంగా ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. ఈ విషయం ఆ తర్వాత తెలిసి దేశ ప్రజలు షాకయ్యారు. బంగారం తాకట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చంద్రశేఖర్ ప్రభుత్వం కూలింది.

పీవీ నరసింహారావు, మన్మోహన్ ఎంట్రీ

ఇంత క్లిష్టమైన పరిస్ధితుల్లో ఎన్నికల్లో నామమాత్రపు మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు నేతృత్వంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పట్లో గొప్ప ఆర్ధిక వేత్తగా పేరున్న మన్మోహన్ సింగ్ ను ఆయన ఆర్దికమంత్రిగా నియమించారు.కాలం చెల్లిన భారత ఆర్దిక వ్యవస్దకు రిపేర్లు చేయడం మొదలుపెట్టిన వీరిద్దరూ అతి తక్కువ కాలంలోనే సక్సెస్ అయ్యారు. చారిత్రక సంస్కరణలతో భారత ఆర్ధిక వ్యవస్థను గాడినపెట్టడం మొదలుపెట్టారు. ఇందులో మన్మోహన్ సలహాలు కీలకంగా మారాయి.

how manmohan singh s reforms transform india from secretly pledging gold to economic growth

మన్మోహన్ ఏం చేశారంటే

1991 జూలై 1న మన్మోహన్ సింగ్ అసలు పని మొదలుపెట్టారు. ఆర్బీఐ జూలై 1న రూపాయి విలువను ఏకంగా 9శాతం తగ్గించింది. మరో రెండు రోజుల్లోనే మరో 11 శాతం తగ్గించింది. భారతదేశ ఎగుమతులను మరింత పోటీగా మార్చడం, దేశం ఆర్ధిక లోటు తగ్గించడమే దీని లక్ష్యం. దీంతో మార్కెట్లు స్థిరీకరణ కావడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గేట్లు తెరిచారు. సుంకాల తగ్గింపు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణలు వంటి చర్యలతో పెట్టుబడుల్ని ఆహ్వానించారు. దీంతో విదేశీ సంస్ధలు, పెట్టుబడుల రాక మొదలైంది. ప్రపంచీకరణలో భారత్ భాగస్వామిగా మారింది.
భారత్ లో విదేశీ వ్యాపారాలు విస్తరించడం మొదలైంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పీవీ, మన్మోహన్ పట్టించుకోలేదు.

దూసుకెళ్లిన భారత్..

1991లో చేపట్టిన సంస్కరణల కారణంగా భారత ఆర్ధిక వ్యవస్థ వృద్ధి చెందడం మొదలుపెట్టింది. దాంతో పాటే పేదరికం స్ధాయిలు తగ్గడం మొదలైంది. విదేశీ పెట్టుబడులకు భారత్ హబ్ గా మారింది. ఐటీ, టెలికాం, ఫార్మా పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. 2000ల నాటికి భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది.పీవీ తర్వాత వాజ్ పేయ్ హయాం, ఆ తర్వాత 2004లో మన్మోహన్ హయాంలో ఈ సంస్కరణలు మరింత వేగంగా సాగాయి.2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ప్రపంచమే మన్మోహన్ సింగ్ మాట వినే పరిస్ధితికి చేరింది. అలాగే భారత్ రెండంకెల ఆర్ధిక వృద్ధిని అందుకుంది. ఈ ఏడాది భారత్.. ఇంగ్లాండ్ బ్యాంక్ లో తాకట్టు పెట్టిన బంగారం తిరిగి తెచ్చుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+