ఢిల్లీ బిల్లులో ఏముంది ? రాష్ట్రపతి ఆమోదం తర్వాత రాజధానిలో ఏం జరగబోతోంది ?

దేశ రాజధాని ఢిల్లీలో అధికారులపై పెత్తనం ఎవరికి ఉండాలనే దానిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన కీలక తీర్పును పక్కనబెడుతూ కేంద్రం ఈ ఏడాది ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి కొనసాగింపుగా పార్లమెంటులో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు 2023 అని పిలిచే ఢిల్లీ బిల్లును తెచ్చింది. ముందుగా లోక్ సభలో, ఆ తర్వాత నిన్న రాజ్యసభలో ఇది ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి ముద్ర కూడా వేసుకుని త్వరలో అమల్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీ బిల్లులో ఏముందనేది ఓసారి చూద్దాం...

ఈ ఏడాది మే 11న సుప్రీంకోర్టు ఢిల్లీలో అధికారులపై పెత్తనం విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఆర్డర్, భూమి, పోలీసులను వదిలి రాజధానిలోని చాలా సేవలపై పూర్తి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చింది. ఇది ఢిల్లీపై పూర్తి పెత్తనాన్ని కోరుకుంటున్న కేంద్రానికి మంట పుట్టించింది. పోస్టింగ్‌లు, బదిలీలు, విజిలెన్స్, ఇతర ఆకస్మిక సమస్యలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సిఫార్సులు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చే ఆర్డినెన్స్‌ను కేంద్రం మే 19న తీసుకొచ్చింది.

how parliament cleared delhi bill impact governance in national capital?

ఇందులో జాతీయ రాజధానిగా ఢిల్లీకి ఉన్న ప్రత్యేక హోదా దృష్ట్యా, ఉమ్మడి, సమిష్టి బాధ్యత ద్వారా ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సమాన బాధ్యత హక్కు ఉందని ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. బదిలీలు, పోస్టింగ్స్, విజిలెన్స్, ఇతర యాదృచ్ఛిక విషయాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్‌కు సిఫార్సులు చేయడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఓ శాశ్వత అథారిటీ ఏర్పాటు చేయాలని ఇది పేర్కొంది.

దీంతో ఆప్ నేతలు రాజధాని నగరంలో శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు, అధికార యంత్రాంగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ తర్వాత ఆర్డినెన్స్ ను బిల్లుగా మార్చి గత గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. అనంతరం నిన్న రాజ్యసభలోనూ ఈ బిల్లుకు విపక్షాల అభ్యంతరాల మధ్యే ఆమోద ముద్ర వేశారు. దీన్ని ఇవాళ రాష్ట్రపతి ముర్ముకు పంపనున్నారు.

ఈ బిల్లులో దేశ రాజధానిలోని అధికారుల విచారణలు, సస్పెన్షన్‌లు కేంద్రం అధీనంలో ఉంటాయని పేర్కొన్నారు. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ యొక్క సిఫార్సులు, ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీని ప్రొరోగ్ చేయడం, సమన్లు ​​చేయడం, రద్దు చేయడం వంటి పలు విషయాలపై లెఫ్టినెంట్ గవర్నర్ తన స్వంత విచక్షణాధికారాన్ని వినియోగించుకునే అధికారం కల్పించారు. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీలో ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ ప్రిన్సిపల్ హోం సెక్రటరీ, ఢిల్లీ ముఖ్యమంత్రి సభ్యులుగా ఉంచారు. రేపు రాష్ట్రపతి ఆమోదం పొందాక ఇవన్నీ అమలైతే ఢిల్లీ పాలన దాదాపుగా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+