హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ కు రోహింగ్యాల అండ ? ఫలితాల్లో తేలిందిదే..!
హర్యానాలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి గెలిచి అధికారం చేపట్టేందుకు సిద్దమవుతోంది. అయితే రాష్ట్రంలో ఈసారి జరిగిన ఎన్నిక్లలో కుల సమీకరణాలు కీలకంగా పనిచేశాయన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ముస్లింలతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి తరలివచ్చి అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల మద్దతు ఈసారి కాంగ్రెస్ పార్టికి లభించినట్లు ఫలితాలను విశ్లేషిస్తే అర్థమవుతోంది.
నూహ్ జిల్లాలోని జిర్కా అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మమ్మాన్ ఖాన్ ఘన విజయం సాధించారు. ఆయన ఏకంగా 96 వేల మెజార్టీతో గెలుపొందారు. ఆయకు వచ్చిన ఓట్లు చూస్తే లక్షా 30 వేలు మాత్రమే. కానీ మెజార్టీ మాత్రం 96 వేలు ఉంది. అదే సమయంలో ఖాన్ కు పడిన ఓట్లను గమనిస్తే ముస్లింలతో పాటు రోహింగ్యాల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. దీని వెనుక కూడా చాలా కీలక కారణాలు ఉన్నాయి.

జిర్కా అసెంబ్లీ స్ధానం పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో గతంలో మతఘర్షణలు జరిగాయి. వాటి తర్వాత ఇక్కడ ముస్లింలతో పాటు రోహింగ్యాలు కూడా ఆయనవైపు మొగ్గినట్లు తెలుస్తోంది. అందుకే ఖాన్ ఇంత భారీ మెజార్టీతో గెలుపొందారనే చర్చ జరుగుతోంది. వాస్తవంగా రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ పలు స్ధానాలు గెలిచిందన్న చర్చ నేపథ్యంలో జిర్కా అసెంబ్లీ సీటు ఫలితాలు తెరపైకి వచ్చాయి.
ఆర్జనైజర్ వీక్లీ తాజాగా విడుదల చేసిన వీడియోలో ఇక్కడి ఓ మదర్సా రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు చూపింది. అవిశ్వాసులు నరకంలో కాలిపోతారంటూ అక్కడి చిన్నారులు చేస్తున్న నినాదాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. అలాగే మయన్మార్ నుంచి వచ్చి అక్కడ నివస్తున్న టీచర్లు సైతం ఇక్కడికి అక్రమంగా వచ్చినట్లు అంగీకరిస్తున్నారు. అలాగే తమకు నూహ్ లో ఎలాంటి సమస్యలు లేవని, ఇక్కడ చిన్నారులకు తాము ఉర్దూ, పష్తూ, ఫార్సీ, ఇంగ్లీష్, హిందీ నేర్పిస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది.












Click it and Unblock the Notifications