వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పిపోయినవారిని ఇంటికి చేర్చిన 'ఆధార్'

మతిస్థిమితం లేని కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఓ యువకుడు 'ఆధార్' కారణంగా తన తల్లిదండ్రుల వద్దకు చేరుకొన్నాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మతిస్థిమితం లేని కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఓ యువకుడు 'ఆధార్' కారణంగా తన తల్లిదండ్రుల వద్దకు చేరుకొన్నాడు.

తొమ్మిదేళ్ళ గౌరవ్ ఆధార్ కారణంగా హర్యానాలోని పానిపట్‌లో ఉన్న తల్లిదండ్రులను కలుసుకొన్నాడు. 2015లో ఇంటిముందు ఆడుకొంటూ అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు.

అయితే తల్లిదండ్రులు అతని కోసం ఎంత ప్రయత్నించినా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.చివరకు ఢిల్లీలోని 'పాల్నా'అనే స్వచ్ఛంధ సంస్థలో ఆయన ఆశ్రయం పొందుతున్నాడు.

How this mentally challenged teenager found his way back home

అతడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని ఆ సంస్థ ప్రయత్నించింది. మానసిక వైకల్యం, మతిమరుపుతో బాధపడుతున్న గౌరవ్‌కు తమ అమ్మ, నాన్నల పేర్లు మాత్రమే గుర్తుకు ఉన్నాయి, ఇతర విషయాలు మాత్రం గుర్తుకు లేవు.

ఈ వివరాలతోనే ఆధార్ నమోదు కోసం బయోమెట్రిక్ నమూనాలు తీసుకోగానే అప్పటికే గౌరవ్ పేరు, వివరాలు నమోదై ఉన్నాయి.

'పాల్నా' సంస్థ ప్రతినిధులు గౌరవ్ తల్లిదండ్రుల వివరాలను సేకరించారు.వారికి గౌరవ్ సమాచారాన్ని ఇచ్చారు. వెంటనే గౌరవ్ కుటుంబసభ్యులు ఢిల్లీకి వచ్చి గౌరవ్‌ను కలుసుకొన్నారు. గౌరవ్ తండ్రికి నోట మాట రాలేదు.

ఆధార్‌కు శతకోటి వందనాలంటూ ఆయన పదేపదే ఉద్వేగంగా ప్రకటించారు. కన్న కొడుకును అక్కున చేర్చుకొని ఆనందంగా తమ ఊరికి తీసుకెళ్ళాడు.

ఇటీవల ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఓ మూగ, బధిర బాలుడు ఎంతో కాలం తర్వాత ఆధార్ ద్వారానే అమ్మా, నాన్నలను తిరిగి చేరుకోగలిగారు. 2015 లో ఆరేళ్ళ వయస్సున్నప్పుడు తప్పిపోయిన అతడు మధ్యప్రదేశ్‌లో అనుప్పుర్ రైల్వేస్టేషన్‌లో దిక్కు తెలియకుండా తిరుగుతోంటే పోలీసులు బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ఈ మధ్యనే ఆధార్ నమోదుకు ప్రయత్నిస్తోంటే వివరాలు తెలిశాయి. ఛత్తీస్‌ఘడ్‌లో రాయగడ నుండి తండ్రి పరుగెత్తుకొచ్చాడు. ఇన్నేళ్ళ తర్వాత కన్పించిన కుమారుడిని తండ్రి ఇంటికి తీసుకెళ్ళాడు.

English summary
A mentally challenged teenager who had strayed away from his family was on Monday reunited with his parents in Haryana's Panipat, all thanks to Aadhaar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X