కేరళ వరదలు: ‘దేవుని సొంత దేశం’కు మీ సాయం అవసరం, ఇలా అందించండి
Recommended Video

తిరువనంతపురం/హైదరాబాద్: ప్రియమైన పాఠకులారా..,
కేరళను దేవుని సొంత దేశం(ప్రాంతం) అని కూడా పిలుస్తారని మనకు తెలిసిన విషయమే. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.
భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 73మంది ప్రాణాలు కోల్పోయారు. ఎర్నాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన 117 సహాయ కేంద్రాలకు వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని 17,974మందిని కేరళ ప్రభుత్వం తరలించింది.
ఈ పరిస్థితిలో కేరళలోని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు మన సాయం అవసరం పడింది. వారి జీవితాలను తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు సాయం అవసరం. అనుకోని ప్రకృతి విపత్తుకు గురై దీనస్థితిలో ఉన్న రాష్ట్రానికి మనం సాయం అందించడం ఒక అవకాశంగా భావించాల్సి ఉంది.

వరదల కారణంగా సుమారు 20వేల ఇళ్లు తీవ్రంగా దెబ్బతినగా, 10వేల కి.మీల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. రూ. 8,351కోట్ల మేర ప్రజలకు సంబంధించిన ఆస్తి(మౌలిక వసతులకు) నష్టం జరిగింది. రాష్ట్రంలోని ప్రజా జీవితాన్ని మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు సాయం అందించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు.
ప్రకృతి విపత్తులో తీవ్రంగా నష్టపోయిన కేరళ ప్రజల సంక్షేమం కోసం తమవంతుగా రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాల్సిందిగా మా పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ముఖ్యమంత్రి డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్ వివరాలు ఈ క్రింద ఇవ్వబడినవి:
గ్రహీత: CMDRF
ఖాతా నెంబర్: 67319948232
బ్యాంక్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్రాంచ్: సిటీ బ్రాంచ్, తిరువనంతపురం
IFSC Code: SBIN0070028
Swift Code: SBININBBT08
keralacmrdf@sbi - UPI
Here's how you can help those affected by the unprecedented floods in Kerala. Now you can make donations online to Chief Minister's Distress Relief Fund through the site, https://t.co/OFHTHlZ9by #KeralaFloods #StandWithKerala. pic.twitter.com/XNlBKqdCUT
— CMO Kerala (@CMOKerala) August 14, 2018












Click it and Unblock the Notifications